అన్వేషించండి

Animal teaser: 'యానిమల్' ఊరమాస్ టీజర్ లోడింగ్ - ఎప్పుడంటే?

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న 'యానిమల్' మూవీ నుంచి టీజర్ రాబోతుంది. సెప్టెంబర్ 28న రణబీర్ బర్త్ డే సందర్భంగా టీజర్ ని విడుదల చేస్తున్నట్లు తాజాగా తెలిపారు.

'అర్జున్ రెడ్డి'(Arjun Reddy) సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండకి స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టిన సినిమా కూడా ఇదే. ఇక ఇదే సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో 'కబీర్ సింగ్'(Kabirsingh) అనే పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక తన తదుపరి సినిమాని బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. 'యానిమల్'(Animal) అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రణబీర్ ని రఫ్ అండ్ రగుడ్ లుక్ లో చూపించబోతున్నాడు దర్శకుడు సందీప్ వంగా.

ఇప్పటివరకు బాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ ని ఈసారి ఊర మాస్ హీరోగా ప్రెజెంట్ చేయబోతున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేయగా, రీసెంట్ గా వచ్చిన ప్రీ టీజర్ ఆ క్యూరియాసిటీని రెట్టింపు చేసింది. ఇక ఇప్పుడు 'యానిమల్' టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టీజర్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. రణబీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 28న 'యానిమల్' టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ టీజర్ కట్ చేసే పనిలో ఎంతో బిజీగా ఉన్నారట.

టీజర్ లో రణబీర్ ఊర మాస్ యాంగిల్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డిని మించేలా రణబీర్ క్యారెక్టర్ డిజైన్ చేశారట సందీప్ వంగా. అంతేకాకుండా టీజర్ తోనే సినిమా కథ ఎలా ఉండబోతుందో చూపించనున్నారట. దీంతో ఈ టీజర్ కోసం ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.  ఈ సినిమాని ముందుగా ఆగస్టు 11న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవ్వడంతో రిలీజ్ ను డిసెంబర్ కి వాయిదా వేశారు. భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ సంస్థలు సుమారు రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ కపూర్, బాబీ డియోల్, పరిణితి చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదల కానుంది.

ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో 'స్పిరిట్' అనే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నట్లు సమాచారం. కెరీర్ లో ఫస్ట్ టైం ఈ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సరసన కియారా అద్వానీ, దీపికా పదుకొనే వంటి స్టార్ హీరోయిన్స్ పేర్లను మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 'యానిమల్' రిలీజ్ అవ్వగానే ఆలస్యం చేయకుండా ప్రభాస్ స్పిరిట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా సందీప్ వంగ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Also Read : హారర్ వెబ్ సిరీస్‌తో వస్తోన్న ఓంకార్ - ఆకట్టుకుంటున్న 'మాన్షన్ 24' ఫస్ట్ లుక్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget