హారర్ వెబ్ సిరీస్‌తో వస్తోన్న ఓంకార్ - ఆకట్టుకుంటున్న 'మాన్షన్ 24' ఫస్ట్ లుక్!
'రాజు గారి గది' ఫ్రాంచైజీ తో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న ఓంకార్ చాలా గ్యాప్ తర్వాత 'మాన్షన్ 24' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.
బుల్లితెర ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ త్వరలోనే ఓ హారర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'రాజు గారి గది 3' తర్వాత సుమారు నాలుగేళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఓంకార్ తనకు కలిసొచ్చిన హారర్ బ్యాక్ డ్రాప్ లోనే ఓ సరికొత్త వెబ్ సిరీస్ తెరకెక్కించారు. వినాయక చవితి సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. హారర్ థ్రిల్లర్ గా కథాంశంతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు 'మాన్షన్ 24'(Mansion24) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లోప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖంతోపాటు చీకటితో నిండిన ప్రదేశంలో ఓ పురాతనమైన బిల్డింగ్ ని చూపించారు. ఈ ఫస్ట్ లుక్ ను బట్టి ఈ పురాతన బిల్డింగ్ లో జరిగే కథగా ఈ వెబ్ సిరీస్ ఉండనుందని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి, అవికా గోర్, అమర్ దీప్ చౌదరి, మానస్, విద్యుల్లేఖ రామన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా మేకర్స్ రివీల్ చేయనున్నట్లు సమాచారం. ఓ పురాతన భవంతిలో అడుగుపెట్టిన కొందరు యువతీ, యువకులకు ఎదురైన పరిణామాలతోనే ఈ వెబ్ సిరీస్ సాగుతుందట.
So excited for this one..My next release#Mansion24 Watch at your own risk ⚠️#Mansion24OnHotstar coming soon..!!#DisneyPlusHotstar.
— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) September 18, 2023
@avika_n_joy @thebindumadhavi @vidyuraman @ActorNandu #MeenaKumari @ActorMaanas @actor_amardeep @shraddhadangara @jois_archie @mgabhinaya… pic.twitter.com/uWRdqFwbRo
ఓంకార్ దర్శకత్వం వహించిన 'రాజు గారి గది' మూవీ తరహాలోనే 'మాన్షన్ 24' వెబ్ సిరీస్ ఉంటుందని అంటున్నారు. ఓంకార్ ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేయడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారట. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన 'రాజు గారి గది' ఫ్రాంచైజీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఫ్రాంచైజీలో భాగంగా త్వరలోనే 'రాజుగారి గది 4' కూడా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓంకార్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేలా ఓంకార్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
బుల్లితెరపై రియాలిటీ షోస్ ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన ఓంకార్ 'రాజు గారి గది' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత సమంత, నాగార్జునతో కలిసి 'రాజు గారి గది 2' సినిమాను తెరకెక్కించారు. ఈ ప్రాంఛైజీకి కొనసాగింపుగా తన తమ్ముడు అశ్విన్ బాబుతో 2019లో 'రాజు గారి గది 3' సినిమాను చేశాడు. వీటిల్లో 'రాజు గారి గది', 'రాజు గారి గది 3' సినిమాలు మంచి సక్సెస్ అందుకోగా.. సమంత నటించిన 'రాజు గారి గది 2' బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఓవైపు సినిమాలపై దృష్టి పెడుతూనే బుల్లితెరపై డాన్స్ ఐకాన్, సిక్స్త్ సెన్స్, కామెడీ స్టార్స్ ధమాకా వంటి రియాలిటీ షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓంకార్ నుంచి రాబోతున్న ఈ మొదటి హారర్ వెబ్ సిరీస్ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.
Also Read : 1960లోకి నయనతార - ఆసక్తిరేపుతోన్న 'మన్నన్‌గట్టి' మోషన్ పోస్టర్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial