1960లోకి నయనతార - ఆసక్తిరేపుతోన్న 'మన్నన్‌గట్టి' మోషన్ పోస్టర్
'జవాన్' వంటి భారీ సక్సెస్ తర్వాత తమిళంలో నయనతార నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మన్నన్ గట్టి'. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం 'జవాన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది నయనతార. షారుక్ సరసన నటించి ఆకట్టుకుంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా సినీ లవర్స్ ఈ సినిమా కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.700 కోట్లకు పైగా కలెక్షన్ ని అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక డెబ్యూ మూవీ తోనే హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న నయనతారకి రాబోయే రోజుల్లో బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే 'జవాన్' వంటి భారీ సక్సెస్ తరువాత నయన్ ఓ తమిళ మూవీకి సైన్ చేసింది. తాజాగా ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. పురాతన నాణాలతోపాటు కొత్త కరెన్సీ నోట్లు మట్టితో కప్పి ఉంచినట్లుగా డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఇక మోషన్ పోస్టర్ వీడియోలో అడవి గుడి తో పాటు కళ్ళకు గంతలు కట్టి ఉన్న న్యాయ దేవతను చూపించారు. ఆ తర్వాత 'మన్నన్ గట్టి' అనే టైటిల్ రివిల్ చేస్తూ ఆ టైటిల్ కింద 'Since 1960' అనే క్యాప్షన్ జోడిస్తూ త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. దీన్ని బట్టి 1960 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టుతో వస్తున్న ఈ మూవీని పాపులర్ యూట్యూబర్ డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ యూట్యూబర్ దర్శకత్వంలో నయనతార ఫిమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్ చేస్తుండడం ఇదే మొదటిసారి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ. వెంకటేష్ సహనిర్మాత. R.D రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, సీన్ రోల్డెన్ సంగీతం అందిస్తున్నారు. జి.మదన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు.ఇదిలా ఉంటే తమిళంలో ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న నయనతార రీసెంట్ టైమ్స్ లో చేసిన 'నెట్రికన్', 'O2', 'కనెక్ట్' వంటి ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
దాంతో నయన్ ఇకపై లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ ని చేయకపోవడమే బెటర్ అనే వాదనలు కూడా వినిపించాయి. కానీ ఈ హీరోయిన్ మాత్రం మళ్లీ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'మన్నన్ గట్టి' ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ ని చూస్తుంటే నయనతార ఈసారి కొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు తమిళంలో జయం రవితో కలిసి 'ఇరైవన్' అనే సినిమా చేస్తోంది నయనతార. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : 'స్కంద' ఊర మాస్ సాంగ్ వచ్చేసింది - ఊర్వశితో రామ్ ఊర మాస్ స్టెప్స్ అదుర్స్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

