'స్కంద' ఊర మాస్ సాంగ్ వచ్చేసింది - ఊర్వశితో రామ్ ఊర మాస్ స్టెప్స్ అదుర్స్!
'స్కంద' నుండి 'కల్ట్ మామ' అనే ఊరమాస్ ని సాంగ్ విడుదల చేశారు మేకర్స్. తమన్ స్వరపరిచిన ఈ పాటలో రామ్ ఉర మాస్ స్టెప్స్ అదిరిపోయాయి.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో 'స్కంద'(Skanda) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'అఖండ' వంటి భారీ హిట్ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. బోయపాటి సినిమాలంటే ఖచ్చితంగా అందులో ఒక ఊర మాస్ సాంగ్ ఉండాల్సిందే. అందులోనూ కమర్షియల్ మూవీ అంటే కచ్చితంగా మాస్ సాంగ్ ఉండడం మన టాలీవుడ్ లో ఆనవాయితీగా వస్తోంది.
ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ సైతం థియేటర్స్ దద్దరిల్లే రేంజ్ లో మాస్ సాంగ్స్ ని కంపోజ్ చేస్తున్నారు. బోయపాటి సినిమాలో మాస్ సాంగ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు రామ్ 'స్కంద' లో కూడా అలాంటి ఉరమాస్ సాంగ్ ని ప్లాన్ చేశాడు బోయపాటి. 'కల్ట్ మామా'(Cult Mama) అంటూ సెప్టెంబర్ 16న ఈ సాంగ్ పోస్టర్ రిలీజ్ చేసి ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచారు. ఇక వినాయక చవితి సందర్భంగా తాజాగా 'కల్ట్ మామా' ఫుల్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. తమన్ ఊర మాస్ ట్యూన్ తో స్వరపరిచిన ఈ గీతాన్ని హేమచంద్ర, రమ్య బెహరా, మహా ఆలపించారు. అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించారు. ఇక రామ్ పోతినేని ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ మాస్ స్టెప్స్ తో అదరగొట్టేసాడు.
ఈ స్పెషల్ సాంగ్లో బాలీవుడ్ ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతేలా రామ్ తో కలిసి స్టెప్పులేసింది. పాటలో రామ్ డాన్స్ తో పాటు ఊర మాస్ లుక్ ఆకట్టుకుంటుంది. పొడవాటి జుట్టు గుబురు గడ్డం కండలు తిరిగిన దేహంతో రామ్ తన మేకోవర్ తో ఆశ్చర్యపరిచాడు. తమన్ మ్యూజిక్ కొత్తగా ఉంది. పాటలో ప్రతి లిరిక్ కి 'కల్ట్ మామ' అని వచ్చేట్టు అనంత శ్రీరామ్ సాహిత్యం బాగుంది. ఈమధ్య మాస్ సాంగ్స్ కి ఎక్కువగా కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందిస్తున్నారు. కానీ ఈ పాటకు మాత్రం అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించడం విశేషం. మొత్తంగా 'స్కంద' నుండి విడుదలైన ఈ 'కల్ట్ మామ' మరో చార్ట్ బస్టర్ గా నిలవడం ఖాయమని చెప్పొచ్చు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. సౌతోపాటు నార్త్ లోనూ మంచి హైప్ తో సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అదే రోజు 'చంద్రముఖి 2' కూడా విడుదలవుతోంది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సీక్వెల్ పై జనాల్లో పెద్దగా అంచనాలు లేవు. దానికి తోడు రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కూడా ఆకట్టుకోలేదు. కాబట్టి 'స్కంద' కి పాజిటివ్ టాక్ వస్తే భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, సాయి మంజ్రేకర్, ప్రిన్స్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Also Read : ఆ విషయం సిరాజ్‌నే అడగండి - వైరల్ అవుతున్న శ్రద్దా కపూర్ ఇన్‌స్టా పోస్ట్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial