Nepal Earthquake: నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం సంభవించిన ఈ భూకంపం నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలకు దారి తీసింది.
న్యూఢిల్లీ: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం సంభవించగా దాని ప్రభావం ఉత్తర భారతదేశంలో కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ తో పాటు పొరుగున ఉన్న బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం నేపాల్- టిబెట్ సరిహద్దు ప్రాంతం లోబుచేకి ఈశాన్యంగా 93 కిలోమీటర్ల దూరంలో మంగళవారం ఉదయం 6:35 గంటలకు భూమి కంపించింది.
Tremors felt in Bihar after earthquake in Xizang (Tibet). pic.twitter.com/8bupeQqD2k
— मौसम विज्ञान केंद्र, पटना (@imd_patna) January 7, 2025
టిబెట్‌లోని షిగాట్సే నగరంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు చైనా అధికారులు తెలిపినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. భూకంప తీవ్రత నేపాల్ లో అధికంగా ఉంది. గతంలో అక్కడ భారీ భూకంపాలు సంభవించాయని తెలిసిందే. 2015లో నేపాల్ రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఆ సమయంలో దాదాపు 9,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 22,309 మంది గాయపడ్డారు.
#WATCH | Earthquake tremors felt in Bihar's Sheohar as an earthquake with a magnitude of 7.1 on the Richter Scale hit 93 km North East of Lobuche, Nepal at 06:35:16 IST today pic.twitter.com/D3LLphpHkU
— ANI (@ANI) January 7, 2025
నేపాల్ రాజధాని ఖాట్మండుకు చెందిన ఓ వ్యక్తి భూంకంపై స్పందించారు. ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తెలిపారుు. "భూకంపం వచ్చినప్పుడు మేం నిద్రపోతున్నాను, కానీ మేం నిద్రిస్తున్న మంచం కదులుతోంది. మా బాబు మంచం కదిలిస్తున్నాడని మొదట అనుకున్నాను. కానీ కిటీకీలు కూడా కదలడం చూసి భయం వేసింది. ఇది భూకంపం అని నిర్ధారించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాం. మా అబ్బాయికి ఫోన్ చేయడంతో అతడు కూడా క్షణాల్లో బయటకు వచ్చాడని’ ఖాట్మండుకు చెందిన మహిళ ANI కి తెలిపింది.