అన్వేషించండి

నిఖిల్ డెబ్యూ మూవీ 'హ్యాపీడేస్' రీరిలీజ్ - కన్ఫర్మ్ చేసిన హీరో, ఎప్పుడంటే?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ డెబ్యూ మూవీ 'హ్యాపీ డేస్' రీరిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 28న రీరిలీజ్ కానున్నట్లు సమాచారం.

'కార్తికేయ 2' సక్సెస్ తో పాన్ ఇండియా వైడ్ గా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. అప్పటివరకు టాలీవుడ్ లో మాత్రమే మీడియం రేంజ్ హీరోగా పలు సూపర్ హిట్స్ అందుకున్న నిఖిల్, ఈ మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం బడా నిర్మాతలతో భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇదిలా ఉంటే నిఖిల్ డెబ్యూ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం మన టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న పలు బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్లీ వెండితెరపై కనువిందు చేస్తున్నాయి. రీరిలీజ్ పేరుతో 4k వెర్షన్ లో మళ్లీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.

హీరోల పుట్టినరోజులు, సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇలా అరుదైన సందర్భాల్లో పాత సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మన టాలీవుడ్ లో రిలీజ్ మూవీస్ కి ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కుతోంది. అందుకు రీరిలీజ్ మూవీస్ కి వస్తున్న కలెక్షన్స్ నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పటికే అగ్ర హీరోల సూపర్ హిట్ సినిమాలు వెండితెరపై కనువిందు చేయగా, తాజాగా ఈ లిస్టులో మరో కల్ట్ క్లాసిక్ మూవీ చేరింది. ఆ సినిమా పేరే 'హ్యాపీ డేస్'(Happy Days). క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీకి యూత్ లో ఎంత క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. 2007లో వచ్చిన ఈ సినిమాకి కాలేజ్ స్టూడెంట్స్ థియేటర్స్ కి క్యూ కట్టారు. గ్యాంగ్, గ్యాంగ్స్ గా థియేటర్స్ లో రచ్చ రచ్చ చేశారు.

ఇంజనీరింగ్ లైఫ్, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల మధ్య జరిగే గొడవలు, స్నేహాలు, ప్రేమలు.. ఇలా జీవితంలో ఒక భాగాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల అద్భుత దృశ్య కావ్యంగాఈ చిత్రాన్ని మలిచారు. దాంతో ఈ మూవీ టాలీవుడ్లో కరెక్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సినిమాతోనే నిఖిల్ సిద్ధార్థ వెండితెరకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వరుణ్ సందేశ్, తమన్నా, రాహుల్, నిఖిల్, వంశీకృష్ణ, గాయత్రి రావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ విడుదలై ఈ ఏడాదితో 18 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మళ్లీ థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమైంది.

అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 28న 'హ్యాపీడేస్' రీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హీరో నిఖిల్ తన ట్విట్టర్లో.." హ్యాపీడేస్ రీ రిలీజ్, ఓకేనా?" అంటూ ట్వీట్ చేశాడు. దాంతో నెటిజన్స్ అంతా ఈ ట్వీట్ కి రిప్లై ఇస్తూ 'రీరిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామంటూ తెలిపారు. కాగా 'హ్యాపీడేస్' రీ రిలీజ్ పై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాలో నటించిన నిఖిల్, తమన్నా తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో నటీ,నటులుగా రాణించలేకపోయారు. తమన్నా ప్రస్తుతం సౌత్ తో పాటూ నార్త్ లోనూ అగ్ర కథానాయికగా దూసుకుపోతుండగా, నిఖిల్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్నాడు.

Also Read : నాని కోసం ముగ్గురు దర్శకుల ఎదురుచూపులు - నేచురల్ స్టార్ నెక్స్ట్ మూవీ ఎవరితో?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Hemant Soren: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bachhala Malli Teaser: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
Embed widget