అన్వేషించండి

నాని కోసం ముగ్గురు దర్శకుల ఎదురుచూపులు - నేచురల్ స్టార్ నెక్స్ట్ మూవీ ఎవరితో?

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'హాయ్ నాన్న' సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత నాని ముగ్గురు డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు. వీరిలో నాని ఎవరితో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ ఏడాది 'దసరా' సినిమాతో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'హాయ్ నాన్న'(Hi Nanna) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు ఈ మూవీతో వెండితెరకి అరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని డిసెంబర్ 21 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి మ్యూజికల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తూ 'సమయమా'(Samayama) ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ పాట మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

నాని తన సినిమాలను ప్రమోట్ చేయడంలో అందరికంటే ముందు ఉంటాడు. అక్టోబర్లో విడుదలయ్య సినిమాలే ఇంకా వాటి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయలేదు. కానీడిసెంబర్ లో తన సినిమా రిలీజ్ ఉన్నా, అప్పుడే 'హాయ్ నాన్న' ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసారు నాని. దీన్నిబట్టి ఈ ఏడాది చివర్లో మరో హిట్టు కొట్టాలని ఎంతో కసిగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే 'హాయ్ నాన్న' తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నాని కోసం ఏకంగా ముగ్గురు దర్శకులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. వారిలో మొదటగా వివేక్ ఆత్రేయతో ఓ క్రైమ్ కామెడీ మూవీని చేయాల్సి ఉంది. ఆపై దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా కూడా ఉన్నట్లు సమాచారం.

ఇక ఈమధ్య తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి తో కూడా నాని సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. తమిళంలో శివ కార్తికేయన్ తో 'డాన్'(Don) సినిమా తీసి భారీ సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు తన నెక్స్ట్ మూవీని నానితో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురిలో నాని తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడు? ఏ సినిమాని ముందు అనౌన్స్ చేస్తాడు? అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి నాని వివేక్ ఆత్రేయ మూవీని వినాయక చవితి సందర్భంగా అనౌన్స్ చేయాలని భావించినప్పటికీ అది జరగలేదు. అటు 'దసరా' తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా సైలెంట్ అయిపోయాడు. కాబట్టి ప్రస్తుతానికి ఈ దర్శకుడుతో నాని సినిమా ఉండే అవకాశం లేదు. మరి 'హాయ్ నాన్న' తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడు అనేది చూడాలి.

'హాయ్ నాన్న' విషయానికొస్తే.. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. నానికి జోడిగా 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, K.S మూర్తి, విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా, ప్రవీణ్ ఆంథోని ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

Also Read : క్లైమాక్స్ చూస్తే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా - ‘7/జీ బృందావన కాలనీ’పై హీరో రవికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Hanuman Ansh Collections : హనుమాన్ అంశ్ వరల్డ్ వైడ్ 400 కోట్లు - తెలుగు వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
హనుమాన్ అంశ్ వరల్డ్ వైడ్ 400 కోట్లు - తెలుగు వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Poonam Kaur Trivikram Srinivas : నా ఫ్యామిలీ బలహీనతను ఆసరాగా చేసుకున్నారు - MAA ఎందుకు ప్రశ్నించడం లేదు?... త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి ఫైర్
నా ఫ్యామిలీ బలహీనతను ఆసరాగా చేసుకున్నారు - MAA ఎందుకు ప్రశ్నించడం లేదు?... త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి ఫైర్
Romantic Action Thriller OTT : చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
Comrade Kalyan Day 1 Collection : కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు సాలిడ్ నెంబర్స్
కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు సాలిడ్ నెంబర్స్

వీడియోలు

India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget