అన్వేషించండి

7/G Brundavan Colony: క్లైమాక్స్ చూస్తే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా - ‘7/జీ బృందావన కాలనీ’పై హీరో రవికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7/జీ బృందావన కాలనీ’. త్వరలో ఈ సినిమా రీ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో రవికృష్ణ కీలక విషయాలు వెల్లడించారు.

తెలుగులో ఎన్ని ప్రేమకథా చిత్రాలు వచ్చినా, ‘7/జీ బృందావన కాలనీ’కి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సెల్వరాఘన్ తెరకెక్కించిన ఈ మూవీ, యువతను ఓరేంజిలో ఆకట్టుకుంది. 2004లో ‘7/జీ రెయిన్‍బో కాలనీ’ పేరుతో తమిళంలో విడుదలైన ఈ సినిమా, అదే ఏడాది ‘7/జీ బృందావన కాలనీ’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ అద్భుత విజయాన్ని అందుకుంది.  మళ్లీ 19 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలుగులో రీ రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్‌ 22న 4K వెర్షన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

హైదరాబాద్ లో ‘7/జీ బృందావన కాలనీ’ రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్

తాజాగా ‘7/జీ బృందావన కాలనీ’ రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చిత్రబృందం హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ వేడుకలో హీరో, హీరోయిన్లు రవి కృష్ణ, సోనియా అగర్వాల్,  నిర్మాత ఎ ఎం రత్నం, ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి కృష్ణ ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Film Combat (@thefilmcombat)

క్లైమాక్స్ చూస్తే డిప్రెషన లోకి వెళ్లిపోతా- రవికృష్ణ

ఈ సినిమా రీ రిలీజ్‌ ట్రైలర్‌ చూస్తుంటే పాతరోజులు మళ్లీ గుర్తుకు వచ్చాయన్నారు హీరో రవికృష్ణ. ఇందులోని సీన్లు జ్ఞాపకం వస్తే..  ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయన్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయినట్లు వెల్లడించారు. అంతేకాదు,  ఇప్పటి వరకూ ఈ సినిమాను ఓకేసారి పూర్తిగా చూసినట్లు వివరించారు. ఈ సినిమాలోని ఎండింగ్ సీన్లు చూస్తే ఇప్పటికీ డిప్రెషన్ లోకి వెళ్లిపోతానని చెప్పారు. అందుకే, ఈ సినిమాను ఎప్పుడూ పూర్తిగా చూడనని చెప్పారు.  ఈ సినిమా షూటింగ్ రోజులలోనూ ఇంట్లో ఏదో ఆలోచిస్తూ కూర్చునేవాడినని చెప్పారు. తనను అలా చూసి అమ్మ బెంగపడేదన్నారు. ఈ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమా కథ ఉండబోతుందన్నారు రవికృష్ణ.

వచ్చే నెల నుంచి సీక్వెల్ పనులు షురూ-ఎంఎం రత్నం

ఇక తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు నిర్మాత ఎంఎం రత్నం. ‘కర్తవ్యం’, ‘భారతీయుడు’ లాంటి అద్భుత చిత్రాలను నిర్మించినట్లు వెల్లడించారు. అయితే, తాను నిర్మించిన చిత్రాల్లో  ‘7జీ బృందావన కాలని’ ఒక కల్ట్‌ మూవీ అని చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరోసారి తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ పనులు వచ్చే నెల నుంచి మొదలుకానున్నట్లు చెప్పారు.  ‘7జీ బృందావన కాలని’ని తెరకెక్కించిన సెల్వరాఘవన్‌ సీక్వెల్‌ను తెరకెక్కిస్తారని చెప్పారు. ఇప్పటికే  స్క్రిప్ట్‌ రెడీ అయినట్లు వెల్లడించారు.  యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా హీరోయిన్ సోనియా అగర్వాల్, నటుడు సుమన్  శెట్టికూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.   

ఇక ‘7/జీ బృందావన కాలనీ’ చిత్రంలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా అలరించింది.  కొడుకుపై ఓ మధ్య తరగతి తండ్రి ఎలా ఆలోచిస్తారన్న అంశాన్ని కూడా భావోద్వేగంగా చూపారు. హీరో తండ్రి పాత్రలో చంద్రమోహన్ ఈ చిత్రంలో అద్భుతంగా చేశారు. ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించారు. సుధ, సుమన్ శెట్టి, సుదీప పింకీ, రథన్, సవిత్ ప్రభునే, మనోరమ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.  

Read Also: నాగ చైతన్య రెండో పెళ్లి వార్తల్లో వాస్తవం లేదట- కానీ, ఆమెతో ప్రేమలో ఉన్నారట!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget