Naga Chaitanya: నాగ చైతన్య రెండో పెళ్లి వార్తల్లో వాస్తవం లేదట- కానీ, ఆమెతో ప్రేమలో ఉన్నారట!
అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఓ నటితో ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున ఇప్పటికే అమ్మాయిని ఫిక్స్ చేశారని ఊహాగానాలు వచ్చాయి. ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ నడిచింది. అమ్మాయి కుటుంబానికి సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని, ఇప్పటికే పెళ్లికి సంబంధించిన మాట ముచ్చట కూడా పూర్తి అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే, ఈ వార్తలను అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ఖండించినట్లు తెలుస్తోంది. అందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించారట.
శోభితతో ప్రేమలో ఉన్న నాగ చైతన్య!
తాజా నివేదికల ప్రకారం నాగ చైతన్య తన స్నేహితురాలు శోభితా ధూళిపాళతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు తమ రిలేషన్ షిప్ గురించి బయటకు చెప్పనప్పటికీ, ఇద్దరూ లవ్ లో మునిగితేలుతున్నారట. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని, లేదంటే నిశ్చితార్థం జరుపుకోవాలనే నిర్ణయానికి వస్తే తప్ప, ఆసలు విషయం బయటకు తెలిసే అవకాశం లేదని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తమ ప్రేమ వ్యవహారాన్ని ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచాలని ఇద్దరూ భావిస్తున్నారట.
చాలా కాలంగా ప్రేమాయణం వార్తలు
సమంత విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాతో పాటు మీడియాలో వీరి గురించి పలు రకాల వార్తలు వినిపించాయి. అయితే, ఈ వార్తలను శోభిత ధూళిపాళ కొట్టిపారేసింది. ప్రస్తుతం తాను సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలిపింది. జీవితంలో ఎన్నో మంచి అనుభూతులను వదిలేసి ఎవరో ఏదో అంటున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. తన గురించి వస్తున్న రూమర్స్ తో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. తప్పు చేయనప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే, గతంలో లండన్ లో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ ఫోటో వెలుగులోకి వచ్చిన తర్వాత వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి బాగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత రెండు మూడు సార్లు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఎవరి పనుల్లో వారు బిజీ
విడాకుల తర్వాత నాగ చైతన్య సినిమాలతో పాటు తనకు ఇష్టమైన స్పోర్ట్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టగా, సమంత తన కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. అటు తన ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇక నాగ చైతన్య చివరిసారిగా ‘కస్టడీ’ మూవీలో కనిపించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని మత్స్యకారుల కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. బన్నీ వాసు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
Read Also: మౌనం యుద్ధాన్ని ఆపుతుందా? ఆసక్తిరేకెత్తిస్తోన్న విజయ్ ‘లియో’ తెలుగు పోస్టర్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial