అన్వేషించండి

మౌనం యుద్ధాన్ని ఆపుతుందా? ఆసక్తిరేకెత్తిస్తోన్న విజయ్ ‘లియో’ తెలుగు పోస్టర్

దళపతి విజయ్ నటిస్తోన్న ‘లియో’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. విజయ్.. తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ‘లియో’ తెలుగు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘లియో’ మూవీ విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ‘విక్రమ్’తో క్రేజీ దర్శకుడిగా మార్కులు కొట్టేసిన లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న మూవీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది దసరా పండుగ రోజు సందడి చేసేందుకు ఈ మూవీ సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ‘లియో’ మేకర్స్.. ఇప్పటి నుంచే ప్రమోషన్స్‌ మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో దళపతి విజయ్ సోషల్ మీడియా వేదికగా ‘లియో’ తెలుగు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 

తాజా పోస్టర్‌లో విజయ్ మంచు కొండల్లో చాలా కూల్‌గా కనిపిస్తున్నాడు. అంతేకాదు.. ఈ పోస్టర్‌పై ‘‘Keep Calm, Avoid The Battle’’ అనే ట్యాగ్ కనిపించింది. ‘‘మౌనంగా ఉండు, యుద్ధాన్ని నివారించు’’ అంటున్నాడంటే.. తప్పకుండా దీనికి ముందు బీభత్సమైన ఫ్లాష్‌బ్యాక్ ఉండి ఉంటుదని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ ఉగ్రరూపాన్ని చూపించారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్, ట్రైలర్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా పండుగకు తెలుగులో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’లతో ‘లియో’ పోటీ పడనుంది. మరి ఈ త్రిముఖ పోటీలో ‘లియో’ నిలబడగలదా? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లియో’

‘లియో’ చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో ‘లియో’ షూటింగ్ ప్రారంభం అయింది. ఫిబ్రవరి నుంచే ఈ మూవీ నుంచి కీలక అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే హీరో విజయ్ పోర్షన్‌ మొత్తాన్ని లోకేష్ కనగరాజ్ పూర్తి చేసేశాడు. మరోవైపు మార్కెట్లో కూడా ఈ మూవీకి లభిస్తున్న క్రేజ్‌ను తమకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ రికార్డు రేటుతో క్లోజ్ అయ్యిందటే.. మేకర్స్ ప్లానింగ్‌తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. థియేటర్లలో రిలీజ్ తర్వాత  రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు కలెక్షన్లను ఈ మూవీ సాధించగలదని అంచనా. పాజిటివ్ టాక్ వస్తే 2.0 రికార్డును (రూ.810 కోట్లు) పైతం ‘లియో’ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. సంజయ్ దత్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ మీనన్, మిస్కిన్, ప్రియా ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘లియో’ నుంచి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘నా రెడీ’ పాట సూపర్ హిట్ అయింది. 

ఫాస్ట్ ఫాస్ట్‌గా సినిమాలు పూర్తి చేస్తున్న విజయ్

తెలుగు స్టార్ హీరోలతో పోల్చితే.. కోలీవుడ్ హీరోలు చాలా వేగంగా సినిమాలు పూర్తి చేస్తారనే టాక్ ఉంది. ముఖ్యంగా విజయ్ ఈ విషయంలో చాలా కచ్చితంగా ఉంటార. ఇందుకు ‘బిస్ట్’, ‘వారిసు’, ‘లియో’లే సాక్ష్యం. ఒక పెద్ద హీరో నెలలల వ్యవధిలోనే మూడు సినిమాలతో వస్తున్నాడంటే అది నిజంగా వండరే. 2022 సమ్మర్‌కు ‘బీస్ట్’గా వచ్చిన విజయ్... కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే 2023 సంక్రాంతికి ‘వారిసు’తో రెడీ అయిపోయారు. ‘లియో’ను కూడా చాలా వేగంగా పూర్తిచేసేసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే.. విజయ్ మరో మూవీకి కూడా డేట్స్ ఇచ్చేశారు. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేసేందుకు అంగీకరించారట. ఆ మూవీని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనేది ప్లాన్. వెంకట్ ప్రభు సినిమాతో సమాంతరంగా మరో మూవీ కూడా చేసేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. 

Also Read: నీకు సినిమా ఎందుకు అని అడిగారు - నా సమాధానం ఇదే: యూట్యూబర్ హర్షసాయి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget