‘సలార్’ ట్రైలర్ రిలీజ్, ‘గుంటూరు కారం’పై ప్రొడ్యూసర్ క్లారిటీ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
రవితేజ, హరీష్ శంకర్‌ల 'మిస్టర్ బచ్చన్' - ఆ హిందీ మూవీకి రిమేక్?
టాలీవుడ్ కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఆదివారమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. లాంగ్ గ్యాప్ తర్వాత హరీష్ శంకర్ - రవితేజ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'షాక్' నిరాశపరచగా ఆ తర్వాత రిలీజ్ అయిన 'మిరపకాయ్' భారీ సక్సెస్ అందుకుంది. మళ్లీ 13 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘సలార్’ రిలీజ్ ట్రైలర్ - ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా - స్నేహితుల కథలో ట్విస్ట్!
ప్రభాస్, పృథ్వీరాజ్ ప్రధాన తారగణంగా తెరకెక్కిన ‘సలార్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. నిర్మాతలు సోమవారం మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ మూవీల తర్వాత ఎన్నో అంచనాలతో ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వర్తించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
విక్రమ్ 'తంగలాన్' విడుదల వాయిదా - కారణం అదేనట!
నీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలు వాయిదా పడడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అన్ని ఇండస్ట్రీలోనూ ఇది కామన్ గా జరిగేదే. స్టార్ హీరోల సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు పలుమార్లు వాయిదా పడుతూ ఉంటాయి. ఇప్పుడు చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. జనవరి రేస్ నుంచి తప్పుకొని ఈ సినిమా సమ్మర్ కు షిఫ్ట్ అయినట్లు తెలిసింది. 2024 వేసవి కానుకగా తంగలాన్ సినిమాను విడుదల చేయబోతున్నారని, కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. 'తంగలాన్' రిలీజ్ వాయిదా పడడానికి కారణం ఈ సినిమాని ఫిలిం ఫెస్టివల్స్ కు పంపడమే అని చెబుతున్నారు. ఫిలిం ఫెస్టివల్స్ లో ఈ మూవీకి మంచి అప్లాజ్ వస్తుందని, దాంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుందని, అప్పుడు సినిమాని రిలీజ్ చేస్తే భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని నిర్మాత సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఆ వార్తలను నమ్మకండి - ‘గుంటూరు కారం’ రూమర్స్‌పై నిర్మాత నాగవంశీ క్లారిటీ
గుంటూరు కారం సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ విషయంలో మహేష్ బాబు సంతృప్తిగా లేడని, మూవీ టీంని పిలిచి మరి ఈ సాంగ్ పై రీవర్క్ చేయమన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. అంతేకాదు మహేష్ బాబు సాంగ్ మార్చమని త్రివిక్రమ్, తమన్ లకు సీరియస్ గా చెప్పాడంటూ కొన్ని రూమర్స్ వైరల్ అవ్వడంతో దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ.." డియర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్, మూవీ లవర్స్.. గుంటూరు కారం సినిమాలో నాలుగు పాటలు ఒక బిట్ సాంగ్ ఉంది. ఇప్పటికే మూడు పాటలు, బిట్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయింది. డిసెంబర్ 21 నుంచి 4వ సాంగ్ షూటింగ్ కి వెళ్తున్నాం. అన్ని షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి. వాళ్లు క్లిక్స్ కోసం అలాంటివి రాస్తుంటారు. మేము సైలెంట్ గా ఉన్నామని మీరు స్ప్రెడ్ చేసే ప్రతి రూమర్ నిజమైపోదు" అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ముంబైలో 120 అడుగుల ప్రభాస్ కటౌట్ - ‘సలార్’ కోసం ఎంత కష్టపడ్డారో చూడండి
ప్రభాస్ నటించిన ‘సలార్’కి నార్త్ లో భారీ హైప్ నెలకొంది. తాజాగా ‘సలార్’ సినిమాకు సంబంధించి ప్రభాస్ 120 అడుగుల భారీ కటౌట్ ను ముంబైలో పెట్టారు. ముంబై థానే లోని R మాల్ ముందు ఉంచిన ఈ 120 అడుగుల భారీ కటౌట్ అక్కడి ఆడియన్స్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఈ కటౌట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వగా.. ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్న వీడియోని హోంబలే నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. 120 అడుగుల భారీ కటౌట్ ని ఏకంగా 125 మంది కొన్ని వారాల పాటు కలిసి తయారుచేసినట్లు వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ కటౌట్ ని ఎలా తయారు చేస్తున్నారో ఈ వీడియోలో చూపించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)