అన్వేషించండి

Mr.Bacchan Latest Update : రవితేజ, హరీష్ శంకర్‌ల 'మిస్టర్ బచ్చన్' - ఆ హిందీ మూవీకి రిమేక్?

Mr.Bacchan : రవితేజతో హరీష్ శంకర్ తెతెరకెక్కిస్తున్న 'మిస్టర్ బచ్చన్' మూవీని బాలీవుడ్లో అజయ్ దేవగన్ నటించిన 'రైడ్' మూవీ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Latest Update On Ravi Teja’s Mr. Bachchan Movie : టాలీవుడ్ కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఆదివారమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. లాంగ్ గ్యాప్ తర్వాత హరీష్ శంకర్ - రవితేజ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'షాక్' నిరాశపరచగా ఆ తర్వాత రిలీజ్ అయిన 'మిరపకాయ్' భారీ సక్సెస్ అందుకుంది. మళ్లీ 13 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

అదేంటంటే, ఈ మూవీని హరిష్ శంకర్ హిందీలో అజయ్ దేవగన్ నటించిన 'రైడ్' సినిమా ఆధారంగా తెరకెక్కించబోతున్నారట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ రైడ్ సినిమాను తీశారు. భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్ పై దాదాపు మూడు రోజులపాటు జరిపిన ఇన్ కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పుడు ఇదే సినిమాని ఆధారంగా చేసుకుని మిస్టర్ బచ్చన్ మూవీని తన స్టైల్ లో రవితేజ ఇమేజ్ కి తగినట్లుగా కమర్షియల్ అంశాలను కలిపి హరీష్ శంకర్ రీమేక్ చేయబోతున్నారట. హరీష్ శంకర్ రీమేక్ చేశాడంటే అది ఒరిజినల్ కన్నా బాగుంటుందని చెప్పడంలో డౌటే లేదు.

గతంలో చూసుకున్నట్లయితే సల్మాన్ ఖాన్ 'దబాంగ్' సినిమాని 'గబ్బర్ సింగ్' గా రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ మూవీ పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు సినీ లవర్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకొని ఒరిజినల్ వెర్షన్ కన్నా అనూహ్య రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన 'జిగర్తాండ' సినిమాను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి 'గద్దల కొండ గణేష్' పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు రవితేజతో తీస్తున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ కూడా 'రైడ్' మూవీకి రీమేక్ అనే విషయం బయటకు రావడంతో పక్కాగా ఈ మూవీ కూడా ఒరిజినల్ కంటే బెటర్ గా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టైటిల్ తోనే తన మార్పులు మొదలెట్టిన హరీష్ శంకర్ ఈ మూవీతో మరోసారి రిమేక్ కింగ్ అనిపించుకోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. కాగా హరిష్ శంకర్ ఈ సినిమాని వీలైనంత తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది పనోరమా స్టూడియోస్, టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : ‘సలార్’ రిలీజ్ ట్రైలర్ - ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget