Salaar Release Trailer: ‘సలార్’ రిలీజ్ ట్రైలర్ - ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా - స్నేహితుల కథలో ట్విస్ట్!
Salaar Telugu Release Trailer: ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. డిసెంబరు 22న రిలీజ్ నేపథ్యంలో నిర్మాతలు మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
Prabhas Salaar Release Trailer: ప్రభాస్, పృథ్వీరాజ్ ప్రధాన తారగణంగా తెరకెక్కిన ‘సలార్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. నిర్మాతలు సోమవారం మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ మూవీల తర్వాత ఎన్నో అంచనాలతో ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వర్తించారు.
‘‘చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు’’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత ప్రభాస్ అదిరిపోయే ఎంట్రీని ట్రైలర్‌లో చూపించారు. ‘‘మెకానిక్‌కు స్పానర్లు, రెంచులు ఎలా వాడాలో తెలుస్తుంది. కానీ, గన్‌లు వాడటం ఎలా తెలుస్తుంది’’ అనే డైలాగ్‌తో ప్రభాస్ మాస్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత వరదరాజ్ మన్నార్(పృథ్వీరాజ్) క్యారెక్టర్‌ను చూపిస్తూ సుల్తాన్ కథ కంటిన్యూ అవుతుంది. ‘‘సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చి ఇచ్చేవాడు. వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు’’ అంటూ వరదరాజ్ గురించి చెబుతున్న సమయంలో శృతిహాసన్ పాత్ర ఎంట్రీ ఇచ్చింది. ‘‘వెయిట్ వెయిట్ ఐ నీడ్ టు డ్రింక్. మందు ఉందా??’’ అని శృతి అడుగుతుంది.
ఆ తర్వాత ఖాన్సార్‌లో ఇద్దరు మిత్రులు కలిసి చేసే పోరాటాన్ని చూపించారు. చూస్తుంటే.. ‘కేజీఎఫ్’ తరహాలోనే అదొక ప్రత్యేక ప్రపంచాన్ని తలపిస్తోంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతోనే సాగింది. ‘‘ఖాన్సార్ ఎరుపెక్కాల’’ అనే డైలాగ్‌తో ప్రభాస్ తన ముఠాతో దాడికి దిగడాన్ని ట్రైలర్‌లో చూడవచ్చు. ఖాన్సార్‌లో కాలిక్యులేటర్ పట్టుకుని ఏదీ లెక్కపెట్టలేం. అందుకే లెక్కపెట్టలేని ఒక పిచ్చోడిని తీసుకొచ్చాను’’ అని వరదరాజ్ అంటాడు. అతడే ‘సలార్’ అని టైటిల్స్‌లో చూపించారు. చివరిగా ‘‘ఖాన్సర్ వల్ల చాలామంది కథలు మారాయి. కానీ, కాన్సర్ కథ మార్చింది. ఇద్దరు స్నేహితులు బద్ద శత్రువులుగా మారడం’’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది.
ఇప్పటికే విడుదలైన ‘సలార్’ ట్రైలర్ అభిమానుల్లో అంచనాల్లో పెంచేసింది. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ చూసి.. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ‘సలార్’ రిలీజ్ ట్రైలర్‌పై ఓ లుక్ వేయండి.
‘సలార్’ (Salaar Release Trailer - Telugu) రిలీజ్ ట్రైలర్:
మొదటి ట్రైలర్‌కు, రిలీజ్ ట్రైలర్‌కు తేడా ఇదే: మొదటి ట్రైలర్‌లో ఖాన్సార్ సామ్రాజ్యం గురించి చూపించారు. అది ఎలా ఏర్పడింది? అక్కడి మనుషులు ఎలా ఉంటారనేది వివరంగా చూపించారు. ప్రభాస్ (దేవ) ఒక్క నిమిషం ఆలస్యంగా స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే, ఇద్దరి స్నేహితుల మధ్య ఉన్న బాండ్, వారిద్దరు శత్రువులను ఎదుర్కోవడం వంటివి ఆసక్తి కలిగించాయి. రిలీజ్ ట్రైలర్ మొత్తం యాక్షన్ ప్యాక్డ్. మరి, మీకు ఈ ట్రైలర్ నచ్చిందా?
Also Read : ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 30 సినిమాలు - థియేటర్స్‌లో ‘బిగ్’ వార్