అన్వేషించండి

Thangalaan: విక్రమ్ 'తంగలాన్' విడుదల వాయిదా - కారణం అదేనట!

Vikram Thangalaan: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న 'తంగలాన్' మూవీని జనవరి నుంచి వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.

Vikram’s Thangalaan postponed : సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలు వాయిదా పడడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అన్ని ఇండస్ట్రీలోనూ ఇది కామన్ గా జరిగేదే. స్టార్ హీరోల సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు పలుమార్లు వాయిదా పడుతూ ఉంటాయి. అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు షూటింగ్ ఆలస్యం అయ్యిందని, మరికొన్నిసార్లు విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాలేదని, ఇంకొన్నిసార్లు బిజినెస్ పూర్తి కాలేదని, థియేటర్స్ తక్కువ దొరుకుతున్నాయంటూ రకరకాల కారణాలతో రిలీజ్ ని వాయిదా వేస్తుంటారు. తాజాగా కోలీవుడ్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఒకటి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఆ సినిమా మరేదో కాదు తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన 'తంగలాన్' అని సమాచారం. 'తంగలాన్' మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విక్రమ్ ఓ ప్రత్యేక గెటప్ లో విభిన్న తరహా పాత్రలో నటిస్తున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. 2024 రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.

అయితే ఇప్పుడు జనవరి రేస్ నుంచి తప్పుకొని ఈ సినిమా సమ్మర్ కు షిఫ్ట్ అయినట్లు తెలిసింది. 2024 వేసవి కానుకగా తంగలాన్ సినిమాను విడుదల చేయబోతున్నారని, కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. 'తంగలాన్' రిలీజ్ వాయిదా పడడానికి కారణం ఈ సినిమాని ఫిలిం ఫెస్టివల్స్ కు పంపడమే అని చెబుతున్నారు. ఫిలిం ఫెస్టివల్స్ లో ఈ మూవీకి మంచి అప్లాజ్ వస్తుందని, దాంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుందని, అప్పుడు సినిమాని రిలీజ్ చేస్తే భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని నిర్మాత సినిమాను వాయిదా వేసినందుకు నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

దర్శకుడు పా. రంజిత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫిల్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ తెగ గురించే తంగలాన్ సినిమా ఉండబోతోంది. ఇందులో విక్రమ్ తెగ నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన విక్రమ్ ఫస్ట్ లుక్ తో వైవిధ్యంగా ఉంది. ఈ మూవీ కోసం విక్రమ్ చాలా కష్టపడుతున్నాడు. ఇందులో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు హీరోయిన్స్ గా నటిస్తుండగా.. పశుపతి, డానియల్ కల్టగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కే ఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : ఆ వార్తలను నమ్మకండి - ‘గుంటూరు కారం’ రూమర్స్‌పై నిర్మాత నాగవంశీ క్లారిటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget