అన్వేషించండి

Guntur Kaaram: ఆ వార్తలను నమ్మకండి - ‘గుంటూరు కారం’ రూమర్స్‌పై నిర్మాత నాగవంశీ క్లారిటీ

Mahesh Babu : 'గుంటూరు కారం' సాంగ్ రూమర్స్ పై స్పందిస్తూ పలు ఆసక్తికర ట్వీట్స్ చేశారు సితార నిర్మాత నాగ వంశీ.

Producer Nagavamshi Reacts On Rumours : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ని ఇస్తూ వస్తున్నారు మూవీ టీమ్. ఇటీవలే గుంటూరు కారం మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో తాజాగా విడుదలైన ఓ మై బేబీ సాంగ్ పై పలు విమర్శలు వచ్చాయి.

ఈ విషయం కాస్త పక్కన పెడితే సితార నిర్మాత నాగ వంశీ ఈ మధ్య ప్రతీ ప్రెస్ మీట్ లోనూ ‘గుంటూరు కారం’ సినిమా గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కంటే ఎక్కువగా తన కామెంట్స్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్ని సినిమాలు వచ్చినా సంక్రాంతి గుంటూరు కారం సినిమాదే అంటూ తేల్చి చెప్పేశాడు. అలా తన కామెంట్స్ తో సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ఎవరైనా సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసినా దానిపై రియాక్ట్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘గుంటూరు కారం’ సినిమా గురించి ఓ రూమర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ఈ రూమర్ పై నాగ వంశీ కాస్త ఘాటుగానే స్పందించాడు.

గుంటూరు కారం సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ విషయంలో మహేష్ బాబు సంతృప్తిగా లేడని, మూవీ టీంని పిలిచి మరి ఈ సాంగ్ పై రీవర్క్ చేయమన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. అంతేకాదు మహేష్ బాబు సాంగ్ మార్చమని త్రివిక్రమ్, తమన్ లకు సీరియస్ గా చెప్పాడంటూ కొన్ని రూమర్స్ వైరల్ అవ్వడంతో దీనిపై నాగ వంశీ స్పందిస్తూ.." డియర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్, మూవీ లవర్స్.. గుంటూరు కారం సినిమాలో నాలుగు పాటలు ఒక బిట్ సాంగ్ ఉంది. ఇప్పటికే మూడు పాటలు, బిట్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయింది. డిసెంబర్ 21 నుంచి 4వ సాంగ్ షూటింగ్ కి వెళ్తున్నాం. అన్ని షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి. వాళ్లు క్లిక్స్ కోసం అలాంటివి రాస్తుంటారు. మేము సైలెంట్ గా ఉన్నామని మీరు స్ప్రెడ్ చేసే ప్రతి రూమర్ నిజమైపోదు" అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చాడు.

దీంతో ఈ ట్వీట్స్ ని మహేష్ ఫ్యాన్స్ రీ ట్వీట్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక 'గుంటూరు కారం' సినిమా విషయానికొస్తే.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యామర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ బాబు ని కంప్లీట్ మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయబోతున్నారు. శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం 2024 జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : శ్రీలీలా షాకింగ్ నిర్ణయం - షూటింగ్స్‌కు బ్రేక్, కారణం ఇదేనట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
Embed widget