అన్వేషించండి

Best Anti-Aging Exercises : వయసును తగ్గించే ఆరు వ్యాయామాలు.. రోజుకు 20 నిమిషాలు చేస్తే అద్భుత ఫలితాలు

Reverse Aging Naturally : బ్యూటీ క్రీమ్స్ ఉపయోగించకుండా.. సహజంగా అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే మీరు క్రీమ్స్ కాదు.. ఈ వ్యాయామాలు చేయండి. ఆటోమెటిక్గా మెరిసిపోతారు.

Simple Home Exercises to Stay Fit and Youthful : నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ.. తమ వయస్సు కంటే చిన్నగా కనిపించాలని కోరుకుంటున్నారు. నిజం చెప్పాలంటే రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ.. వ్యాయామం చేయకుండా.. అందంగా కనిపించాలనుకుంటారు. ఈ కోరికను క్యాష్ చేసుకుంటూ.. ప్రపంచవ్యాప్తంగా యాంటీ-ఏజింగ్ క్రీములు, లోషన్లు మార్కెట్ చేస్తున్నారు. అయితే క్రీములు చేసే మాయకంటే.. వ్యాయామం మంచి ఫలితాలు ఇస్తుందని.. రక్తనాళాల శస్త్రచికిత్స నిపుణులు (Vascular Surgeon) డాక్టర్ సుమిత్ కపాడియా చెప్తున్నారు. 

శరీరంలో శక్తి తగ్గడం, అలసట, కీళ్లలో లేదా కండరాలలో నొప్పి లేదా బిగుతు (stiffness) వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాని తెలిపారు డాక్టర్ కపాడియా. ఈ సమస్యలన్నింటికీ సమాధానం కేవలం 20 నిమిషాలలో ఇంట్లోనే చేయగలిగే ఆరు యాంటీ-ఏజింగ్ వ్యాయామాలు అని తెలిపారు. ఈ వ్యాయామాలు మీ గుండె, శ్వాసకోశ ఆరోగ్యాన్ని (cardiorespiratory health) మెరుగుపరచడమే కాకుండా.. రక్త ప్రసరణను పెంచి.. కీళ్ల ఒత్తిడిని, బిగుతును తగ్గిస్తాయని చెప్తున్నారు.

వృద్ధాప్య ఛాయలను దూరం చేసి.. స్కిన్ మెరిసేలా చేస్తాయంటున్నారు. దానికోసం చేయాల్సిన 6 వ్యాయామాలు సూచిస్తున్నారు. వ్యాయమం చేసే ముందు కచ్చితంగా వార్మ్-అప్ చేయాలి. అలాగే అద్భుతాలు చేసే 6 యాంటీ-ఏజింగ్ వ్యాయామాలు ఏంటో.. వాటివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

స్క్వాట్స్ (Squats) 

సాధారణంగా స్క్వాట్స్ మోకాళ్ళకు హానికరం అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది రివర్స్. స్క్వాట్స్ మీ తుంటి కండరాలు, కాలు కండరాలు, ముఖ్యంగా మీ కోర్ (core) ప్రాంతంలో బలం, శక్తి, సమతుల్యత (balance), సమన్వయాన్ని (coordination) పెంచుతుంది.

లంజెస్ (Lunges)

లంజెస్ అనేది దిగువ శరీరానికి (lower body) మరో అద్భుతమైన కాంప్లెక్స్ కదలిక. ఇది కాలు కండరాలలో బలం, కండరాల సమన్వయం, సమతుల్యతను పెంపొందిస్తుంది. ప్రతి కాలుతో 10 రెప్స్ చొప్పున రెండు సెట్లు చేయాలి. 

స్టెప్-అప్స్ (Step-ups)

స్టెప్-అప్స్ కోసం మెట్లు (staircase) లేదా ఒక బాక్స్ ఉపయోగించవచ్చు.ఇది స్థిరత్వం, సమన్వయం, సమతుల్యతను మెరుగుపరచడానికి అద్భుతమైన మార్గం. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు వీపు ముందుకు లేదా వెనుకకు వంగకుండా చూసుకోవాలి.

పుష్-అప్స్ (Push-ups) 

పుష్-అప్స్ అనేది ఎగువ శరీరానికి (upper body) సంబంధించిన వ్యాయామం. ఇది భుజాలు (shoulder), ఛాతీ (chest), ట్రైసెప్స్ (triceps) కండరాలకు బలాన్ని ఇస్తుంది.  ఇది కోర్ బలాన్ని కూడా పెంచుతుంది.

ప్లాంక్ (Plank) 

ప్లాంక్ చాలా సులభమైనది. కానీ కోర్ (core) బలానికి అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. మొదట్లో 20 సెకన్ల పాటు ప్లాంక్‌ను చేయడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత నెమ్మదిగా సమయాన్ని పెంచుకోవాలి.

గ్లూట్ బ్రిడ్జెస్ (Glute Bridges)

వయస్సు పెరిగే కొద్దీ బలహీనపడే కండరాలలో గ్లూటియల్ కండరాలు (తుంటి కండరాలు) ముఖ్యమైనవి. ఈ కండరాలు బలహీనపడటం తరచుగా వెన్ను సమస్యలకు దారితీస్తుంది. గ్లూట్ బ్రిడ్జెస్ ఈ కండరాలను అలాగే హామ్‌స్ట్రింగ్, దిగువ వీపు (lower back) కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

ఈ వ్యాయామాలను పూర్తి చేసిన తర్వాత.. కండరాలు, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, హృదయ స్పందన రేటును సాధారణ స్థితికి తీసుకురావడానికి కూల్-డౌన్ (Cool-down) తప్పనిసరిగా చేయాలి. క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్, హామ్‌స్ట్రింగ్/గ్లూట్ స్ట్రెచ్ వంటివి చేస్తే బెస్ట్ అని తెలిపారు డాక్టర్ సుమిత్ కపాడియా. ఈ 20 నిమిషాల దినచర్యను అలవాటు చేసుకోవడం ద్వారా.. మీరు కేవలం బయటి నుంచే కాకుండా.. లోపలి నుంచి యవ్వనంగా ఉంటారు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget