Salaar Cutout:ముంబైలో 120 అడుగుల ప్రభాస్ కటౌట్ - ‘సలార్’ కోసం ఎంత కష్టపడ్డారో చూడండి
Salaar : సలార్ మూవీ రిలీజ్ సందర్భంగా ముంబైలోని ఓ థియేటర్ వద్ద ప్రభాస్ 120 అడుగుల భారీ కటౌట్ ని ఏర్పాటు చేసిన వీడియోని మూవీ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Prabhas Salaar 120 Feet Cut Out At Mumbai : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి నార్త్ లీక్ ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి నిరూపితమైంది. ‘సలార్’ విడుదల సందర్భంగా ముంబైలోని ఓ థియేటర్ దగ్గర 120 అడుగుల ప్రభాస్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని ‘సలార్’ మూవీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కి 'సాహో' సినిమాతో నార్త్ లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. 'సాహో' మూవీ సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువగా ఆడింది. ప్లాప్ టాక్ తోనే ఈ మూవీ బాలీవుడ్ లో రూ.100 కోట్లు వసూలు చేసింది.
ఇక ప్రభాస్ తాజాగా నటించిన ‘సలార్’ కి కూడా నార్త్ లో భారీ హైప్ నెలకొంది. తాజాగా ‘సలార్’ సినిమాకు సంబంధించి ప్రభాస్ 120 అడుగుల భారీ కటౌట్ ను ముంబైలో పెట్టారు. ముంబై థానే లోని R మాల్ ముందు ఉంచిన ఈ 120 అడుగుల భారీ కటౌట్ అక్కడి ఆడియన్స్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఈ కటౌట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వగా.. ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్న వీడియోని హోంబలే నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. 120 అడుగుల భారీ కటౌట్ ని ఏకంగా 125 మంది కొన్ని వారాల పాటు కలిసి తయారుచేసినట్లు వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ కటౌట్ ని ఎలా తయారు చేస్తున్నారో ఈ వీడియోలో చూపించారు.
ఈ భారీ కటౌట్ ని క్రేన్ సహాయంతో ఉంచారు. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ ‘సలార్’ భారీ కటౌట్ కి ఫిదా అవుతున్నారు. ముంబైలో ఒక మూవీ ప్రమోషన్ కోసం ఇలాంటి భారీ కటౌట్ ని మునుపెన్నడు ఏర్పాటు చేసింది లేదు. కేవలం ప్రభాస్ కు మాత్రమే ఆ ఘనత దక్కడం విశేషం. దీన్ని బట్టి బాలీవుడ్‌లో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో స్పష్టమవుతుంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కు ఇలాంటి భారీ కటౌట్స్ పెట్టేవాళ్ళు అభిమానులు.
కానీ ఇప్పుడు బాలీవుడ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి భారీ కటౌట్స్ పెట్టడం విశేషం అనే చెప్పాలి. కాగా ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ తో పాటు నార్త్ లోను ఓపెన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5000 థియేటర్స్ లో ‘సలార్’ ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. దీంతో కచ్చితంగా ఈ మూవీ వెయ్యికోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 22 న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Also Read : ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 30 సినిమాలు - థియేటర్స్‌లో ‘బిగ్’ వార్
View this post on Instagram