(Source: ECI/ABP News/ABP Majha)
HanuMan Box Office Collection Day 11: 11వ రోజు ‘హనుమాన్’కు షాక్, ఎంత వసూలు చేసిందంటే?
HanuMan Box Office Collection: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ మూవీ ‘హనుమాన్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. 11వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 7 కోట్లు వసూళు చేసింది.
HanuMan Movie Box Office Collection Day 11: సంక్రాంతి బరిలో దిగిన ‘హనుమాన్’ మూవీ రెండో వారంలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 10 రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్క్ ను అందుకున్న ఈ మూవీ, ఫస్ట్ వీకెండ్ కంటే సెకెండ్ వీకెండ్ ఎక్కువ కలెక్షన్లను సాధించింది. రెండో సోమవారం కూడా వసూళ్ల పరంగా దూకుడు కొనసాగించింది. అయితే గత వారం రోజులకంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ఉత్సవం వల్ల ప్రేక్షకులు తగ్గి ఉండవచ్చని, వీకెండ్‌లో మళ్లీ పుంజుకోవచ్చని తెలుస్తోంది.
‘హనుమాన్’ 11వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్ ఎంతంటే?
యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ 11వ రోజు దేశ వ్యాప్తంగా రూ. 7.5 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.5.25 కోట్లు సాధించింది. హిందీ రీజియన్‌లో రూ. 2.25 కోట్లు అందుకుంది. వాస్తవానికి ‘హనుమాన్’ మూవీ రిలీజ్ అయ్యాక, తొలిసారి ఇంత తక్కువ వసూళ్లను సాధించింది. ఇక హనుమాన్ మూవీ 10వ రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు క్రాస్ చేసింది. చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. 10వ రోజు ఈ మూవీ రూ. 17.6 కోట్లు వసూలు చేసింది. తెలుగులో రూ.11.9 కోట్లు, హిందీలో రూ.5.15 కోట్లు, తమిళంలో రూ. 20 లక్షలు, కన్నడలో రూ.30 లక్షలు, మలయాళంలో రూ. 5 లక్షలు వసూళు చేసింది.
‘హనుమాన్’ గురించి..
‘హనుమాన్’ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు. అంజనాద్రి అనే ఊహాజనిత గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఓ సాధారణ యువకుడికి ఆంజనేయుడి ద్వారా పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చూపించారు.
‘జై హనుమాన్’ పనులు షురూ
యోధ్య రామ మందిరం సందర్భంగా ఈ స్పెషల్ డేకు ప్రశాంత్ వర్మ సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇంకా హనుమాన్ థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగానే సీక్వెల్‌పై క్రేజ్ అప్‌డేట్ ఇచ్చాడు. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు ప్రశాంత్ వర్మ. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రశాంత్ వర్మ హైదరాబాద్‌లోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘జై హనుమాన్’ స్క్రిప్ట్ బుక్‌ను ఆయన హనుమాన్ విగ్రహం ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుందన్నారు. "హనుమాన్‌పై అపారమైన ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిక కృతజ్ఞుడిని. నా వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నాను. చెప్పినట్టుగానే జై హనుమాన్‌ను 2025లో రిలీజ్ చేస్తాం. అయోధ్య రామమందిరం సందర్భంగా జై హనుమాన్ పనులను ప్రారంభించాం” అని తెలిపారు.
Read Alos: ఆ పోస్టులతో రూ.కోటి సంపాదించే నటికి ఇన్‌స్టాగ్రామ్ షాక్, కారణం ఏంటో తెలుసా?