Sofia Ansari: ఆ పోస్టులతో రూ.కోటి సంపాదించే నటికి ఇన్‌స్టాగ్రామ్ షాక్, కారణం ఏంటో తెలుసా?
Sofia Ansari: మోడల్ సోఫియా అన్సారీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం బోల్డ్ ఫోటోలు, వీడియోలతో కుర్రకారును కవ్విస్తూ ఇన్ స్టాలో 10 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది.
Sofia Ansari: సోఫియా అన్సారీ. సోషల్ మీడియా అకౌంట్ ఉన్నవారికి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టిక్ టాక్ ద్వారా ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ, ఆ తర్వాత ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది. నిత్యం ఇన్ స్టాగ్రామ్‌లో బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ తనదైన స్టైల్‌లో మంచి గుర్తింపు పొందింది. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. ఏ పోస్ట్ షేర్ చేసిన క్షణాల్లో ఇట్టే వైరల్ కావడం విశేషం. ఇప్పటికే సోఫియా ఇన్ స్టాగ్రామ్‌లో ఏకంగా పది మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.
గుజరాత్ లో జన్మించిన సోఫియా
సోఫియా అన్సారీ 1996లో గుజరాత్‌లో ముస్లిం కుటుంబంలో జన్మించింది. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హాట్ హాట్ డ్యాన్సులతో బాగా పాపులర్ అయ్యింది. మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ ను నిషేధించడంతో తన మకాం ఇన్ స్టాగ్రామ్ కు మార్చింది. టిక్ టాక్ మాదిరిగానే ఇన్ స్టాలో రీల్స్, బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ బాగా పాపులర్ అయ్యింది. నెమ్మదిగా ఫాలోవర్లను పెంచుకుంటూ వెళ్లింది. ఇప్పుడు ఆ సంఖ్య 10 మిలియన్లు దాటింది.
సోఫియా అకౌంట్ పై ఇన్ స్టా నిషేధం
ఇక సోషియా అన్సారీ బోల్డ్ కంటెంట్ మీద చాలా మంది యూట్యూబర్ లు తీవ్ర విమర్శలు చేశారు. ఆమె కంటెంట్ సోషల్ మీడియా గైడ్ లైస్ కు వ్యతిరేకంగా ఉందంటూ శివమ్ సింగ్ రాజ్‌పుత్ లాంటి వారు బహిరంగంగానే విమర్శించారు. ఈ విమర్శలపై సోఫియా అన్సారీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను విమర్శించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావించింది. కానీ, ఇంతలోనే ఈ ముద్దుగుమ్మకు ఇన్‌స్టా షాక్ ఇచ్చింది. కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉల్లంఘించిందనే కారణంతో 2022లో ఆమెపై ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను టెంపరరీగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో యూట్యూబర్లు చేసిన విమర్శలకు బలం చేకూర్చినట్లు అయ్యింది. సోఫియా సైతం వెనక్కి తగ్గింది.
ఏడాదికి రూ. కోటి సంపాదన
సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపు తో సోషియా పలు వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలలో నటించింది. ‘MX Taka Tak Fame House’ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు మ్యూజిక్ వీడియోస్ కూడా చేసింది. ఆమె అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా అన్సారీ సోషల్ మీడియా ద్వారా ఏడాదికి ఏకంగా రూ. కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ ఏడాదిలో రూ. 90 లక్షలకు పైగా డబ్బు అందుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా తన అంద చందాలతో ఈ ముద్దుగుమ్మ డబ్బుతో పాటు పాపులారీటీని సొంతం చేసుకుంటుంది.
View this post on Instagram
Read Also: ఆ డ్రెస్ వేసుకుని సిగ్గుతో బయటకు రాలే, బోల్డ్ సీన్స్ చేసే వాళ్లకు దండం పెట్టాలన్న మీనా