అన్వేషించండి

Meena: ఆ డ్రెస్ వేసుకుని సిగ్గుతో బయటకు రాలే, బోల్డ్ సీన్స్ చేసే వాళ్లకు దండం పెట్టాలన్న మీనా

Meena: సీనియర్ నటి మీనా బోల్డ్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సీన్లలో నటించడం నిజంగా చాలా కష్టం అన్నారు.

Meena About Glamour Roles And Bikini Scenes: మీనా. ఒప్పుడు తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. 90వ దశకంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్ సహా పలువురు అగ్ర హీరోలతో నటించారు. అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న రోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, బోల్డ్ సీన్లు, గ్లామరస్ పాత్రల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

బోల్డ్ సీన్లు చేయాలనే సలహా ఇచ్చింది ఆయనే!

సాధారణ పాత్రలు చేసే తనకు గ్లామర్ రోల్స్ చేయాలని ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా సలహా ఇచ్చినట్లు మీనా వెల్లడించారు. “నేను మొదటి నుంచి గ్లామరస్ పాత్రలు చేసేదాన్ని కాదు. సాధారణ పాత్రల్లోనే నటించేదాన్ని. ఆ సమయంలో చాలా మంది నాకు గ్లామర్ పాత్రలు చేయాలని సలహా ఇచ్చారు. బోల్డ్ సీన్లు, స్విమ్ సూట్ సన్నివేశాలు కూడా చేయాలని ప్రభుదేవా నాకు అడ్వైజ్ ఇచ్చారు. ఆయన సలహా ఇచ్చిన కొన్నాళ్లు ఓ గ్లామరస్ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. ప్రభుదేవాతో చేసే సినిమాలోనే స్విమింగ్ డ్రెస్ వేసుకున్నాను. కానీ, సిగ్గుతో మేకప్ రూమ్ నుంచి బయటకు రాలేదు.బోల్డ్ సీన్లలో నటించడం చాలా కష్టమైన పని. అలాంటి సన్నివేశాల్లో కొందరు హీరోయిన్లు చక్కగా నటిస్తారు. వారి కాళ్లకు నిజంగా దండం పెట్టాలి అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చారు.  

ఇక 'దృశ్యం' సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది మీనా. పలు మలయాళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. 'బిగ్ బాస్' ఫేమ్ సొహైల్ హీరోగా నటిస్తున్న 'ఆర్గానిక్ మామ - హైబ్రిడ్ అల్లుడు'లో రాజేంద్ర ప్రసాద్, మీనా జంటగా కనిపించారు. ప్రస్తుతం మీనా చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి.

మీనా రెండో పెళ్లిపై మీడియా కథనాలు

అటు మీన భర్త విద్యాసాగర్  2022లో అనారోగ్య సమస్యలతో చనిపోయారు. అయితే, ఇంట్లో పెద్దలు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నా, తను మాత్రం అంగీకరించట్లేదని తెలుస్తోంది. రీసెంట్ గా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, తన లైఫ్ గురించి, జీవితంలో జరగబోయే అంశాలు గురించి కథలు, కథనాలు ప్రసారం చేయడం ఆపేయమని ఆమె రిక్వెస్ట్ చేశారు. అయినా సరే, మీనా రెండో పెళ్లి చేసుకుంటున్నారని తమిళ మీడియా కథనాలు  ప్రసారం చేస్తోంది. తన కంటే వయసులో చిన్నోడితో, విడాకులు తీసుకున్న వ్యక్తితో మీనా రెండో పెళ్ళికి రెడీ అయ్యారని ఓ తమిళ యూట్యూబ్ మీడియా వెల్లడించింది.  ఇటీవల తన భార్యకు విడాకులు ఇచ్చిన యువ తమిళ కథానాయకుడు, మీనా పెళ్లి చేసుకోనున్నారని ఆ కథనం సారాంశం. ఈ వార్తల్లో వాస్తవం లేదనే టాక్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది.  

Read Also: సెట్లో ఉన్నంత సేపు నాకు అదే ధ్యాస, అసలు విషయం చెప్పేసిన శ్రీలీల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Embed widget