News
News
X

Sushmita Sen Breakup : రెండు నెలలకు పెటాకులైన డేటింగ్ కథ - మోడీతో సుస్మిత బ్రేకప్?

రెండు నెలలకు సుస్మితా సేన్ ప్రేమకథ పెటాకులైందని ముంబై గుసగుస. లలిత్ మోడీకి, ఆమెకు బ్రేకప్ అయ్యిందని టాక్. 

FOLLOW US: 

రెండు నెలల కిందటి సంగతి... జూలై రెండో వారంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ చేసిన ఒక పోస్ట్ అటు క్రికెట్ ప్రపంచంలో, ఇటు హిందీ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఆ పోస్ట్ ఎవరూ ఊహించనిది. మాజీ విశ్వ సుందరి, హిందీ హీరోయిన్ సుష్మితా సేన్ (Sushmita Sen), తాను డేటింగ్‌లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మాల్దీవుల నుంచి ఇటలీ వరకు ట్రిప్ వేశారు. లేటెస్ట్ టాక్ ఏంటంటే... వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యిందట.

సుస్మిత ఫోటో తీసేసిన లలిత్ మోడీ
సుష్మితా సేన్‌తో డేటింగ్ విషయాన్ని వెల్లడించిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో లలిత్ మోడీ (Lalit Modi) తన డీపీ (డిస్‌ప్లే పిక్చర్) చేంజ్ చేశారు. ఆమెతో దిగిన ఫోటో ఉంచారు. ఆ తర్వాత బయోలో సుస్మితను తన ప్రేయసిగా పేర్కొన్నారు. కట్ చేస్తే... రెండు నెలలకు మళ్ళీ అంతా తారుమారు అయ్యింది.

ఇప్పుడు లలిత్ మోడీ ఇన్‌స్టా డీపీలో సుస్మితతో దిగిన ఫోటో లేదు. అది తీసేసి తన ఫోటో మాత్రమే పెట్టుకున్నారు. పోనీ, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ మార్పు చేశారని అనుకున్నా... బయోలో కూడా సుస్మిత పేరు తీసేశారు. దాంతో ఇండస్ట్రీలో జనాలకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా... లలిత్ మోడీ, సుస్మితా సేన్ ప్రేమకథకు ఫుల్ స్టాప్ పడిందని, ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందని వినబడుతోంది. అయితే... సుష్మితతో ఫోటోలు మాత్రం ఆయన సోషల్ మీడియాలో ఉన్నాయి.

మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు మళ్ళీ దగ్గరైన సుష్మిత?
ఇటీవల సుస్మితా సేన్ దత్త పుత్రిక రీనా పుట్టినరోజు జరిగింది. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన మాజీ విశ్వ సుందరి... పార్టీ ఇచ్చారు. అందులో సుష్మితా సేన్ మాజీ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు కనిపించారు. రోమన్ షాల్, రితిక్ బాసిన్ పార్టీకి అటెండ్ అయ్యారు. వారం రోజుల క్రితం కూడా కుమార్తె, రోమన్ షాల్‌తో సుష్మితా సేన్ కనిపించారు. దాంతో అతడికి మళ్ళీ దగ్గర అయ్యిందా? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కుటుంబ సభ్యులకు తెలియని సుస్మిత ప్రేమకథ
లలిత్ మోడీ ఫోటోలు షేర్ చేసిన తర్వాత... సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్, తండ్రి షుబీర్ సేన్ స్పందించారు. ఆ ప్రేమ కథ గురించి తమకు ఏమీ తెలియదని, తాము కూడా మీడియాలో చూసి తెలుసుకున్నామని చెప్పారు.

Also Read : మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిగా శర్వానంద్

లలిత్ మోడీ 'బెటర్ హాఫ్' అంటూ ఫస్ట్ పోస్ట్ చేయడంతో సుస్మితను ఆయన పెళ్లి చేసుకున్నారని చాలా మంది భావించారు. అయితే... అటువంటిది ఏమీ లేదని తర్వాత స్పష్టత ఇచ్చారు. ''జస్ట్ ఫర్ క్లారిటీ... పెళ్లి చేసుకోలేదు. డేటింగ్ చేసుకుంటున్నాం. ఏదో ఒక రోజు పెళ్లి కూడా జరుగుతుంది'' అని లలిత్ మోడీ వివరణ ఇచ్చారు. అయితే... పెళ్లి పీటల వరకు వెళ్లకుండా కేవలం రెండు నెలల్లో ఆ ప్రేమ కథ పెటాకులు అయ్యింది. ఇప్పుడు లలిత్ మోడీ వయసు 56 ఏళ్ళు. సుష్మితా సేన్ వయసు 46 ఏళ్ళు. ఆ వయసు కారణంగా మీడియాలో వీళ్ళ లవ్ స్టోరీ ఎక్కువ హైలైట్ అయ్యింది.  

Also Read : ర‌ణ్‌బీర్‌, ఆలియాకు నల్ల బ్యాడ్జీలతో స్వాగతం - సోషల్ మీడియా నుంచి గుడికి చేరిన ఆగ్రహ జ్వాలలు

Published at : 07 Sep 2022 01:11 PM (IST) Tags: Lalit Modi Sushmita Sen Breakup Sushmita Sen Lalit Modi Lalit Modi Instagram

సంబంధిత కథనాలు

SSMB28: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ - త్రివిక్రమ్ ఒప్పుకుంటారా?

SSMB28: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ - త్రివిక్రమ్ ఒప్పుకుంటారా?

Godfather Vs Ghost : 'గాడ్ ఫాదర్' వర్సెస్ 'ఘోస్ట్' - ఒకటి టమోటా, ఇంకొకటి ఉల్లిపాయ్  

Godfather Vs Ghost : 'గాడ్ ఫాదర్' వర్సెస్ 'ఘోస్ట్' - ఒకటి టమోటా, ఇంకొకటి ఉల్లిపాయ్  

Chiranjeevi: 'దర్శకుడు చెప్పినట్లే చేశా' - 'ఆచార్య' ప్లాప్ పై చిరు కామెంట్స్!

Chiranjeevi: 'దర్శకుడు చెప్పినట్లే చేశా' - 'ఆచార్య' ప్లాప్ పై చిరు కామెంట్స్!

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?