Oke Oka Jeevitham Movie Highlights : మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిగా శర్వానంద్
శర్వానంద్ కథానాయకుడిగా నటించిన 'ఒకే ఒక జీవితం' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ఆయన మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిగా కనిపించబోతున్నారు. ఇంకా సినిమాలో హైలైట్స్ ఏంటంటే...
![Oke Oka Jeevitham Movie Highlights : మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిగా శర్వానంద్ Oke Oka Jeevitham Movie Highlights Sharwanand as Megastar Chiranjeevi Die Hard Fan In Oka Oka Jeevitham Oke Oka Jeevitham Movie Highlights : మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిగా శర్వానంద్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/fc574aa6f1ca60e5ccb051939a5d65991662522378184313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో శర్వానంద్ (Sharwanand) కు మంచి బాండింగ్ ఉంది. ఆయనకు చిరు తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్. అదొక్కటే కాదు... చిరంజీవితో కలిసి థంబ్స్ అప్ యాడ్‌తో శ్వరానంద్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. హీరో అయ్యాక మెగాస్టార్‌తో కలిసి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాలో నటించారు. శర్వాకు చిరు అంటే అభిమానం. అందుకు, చాలా కారణాలు ఉన్నాయి. తాజా సినిమాలో ఆ అభిమానాన్ని చూపించారు.
శర్వానంద్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham Movie). ఆయనకు జంటగా రీతూ వర్మ నటించారు. కథానాయకుడి స్నేహితుల పాత్రల్లో 'వెన్నెల' కిశోర్, ప్రియదర్శి కనిపించనున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. కాలం మారినా సినిమాలో మారనిది ఏంటంటే... చిరంజీవి మీద హీరోకి ఉన్న అభిమానం.
Sharwanand As Chiranjeevi Fan : 'ఒకే ఒక జీవితం' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిగా శర్వానంద్ కనిపించనున్నారు. ఆయనతో పాటు 'వెన్నెల' కిశోర్, ప్రియదర్శి కూడా! సినిమాలో చిరంజీవి రిఫరెన్సులు కూడా ఉన్నాయి. 'హిట్లర్', 'సైరా నరసింహారెడ్డి' సినిమాల ప్రస్తావన ఉంది. అయితే... సినిమాలో మెగా అభిమానం కాన్సెప్ట్ మెయిన్ హైలైట్ కాదు. మదర్ సెంటిమెంట్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నాయని తెలుస్తోంది.
Oke Oka Jeevitham Celebrity Premier Show : 'ఒకే ఒక జీవితం' సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని నటించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో వేసిన సెలబ్రిటీ ప్రీమియర్ షోకి కింగ్ అక్కినేని నాగార్జున, అఖిల్, దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి తదితరులు అటెండ్ అయ్యారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రామ్ చరణ్, రానా కోసం 'ఒకే ఒక జీవితం' సినిమా స్పెషల్ షో వేయాలని కూడా శర్వానంద్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ అఖిల్ అక్కినేని ఈ సినిమా కోసం స్పెషల్ ప్రమోషనల్ వీడియో ఒకటి చేశారు. రామ్ చరణ్, రానాకు సినిమా నచ్చితే వాళ్ళు కూడా ప్రమోషన్స్ చేస్తారు. ఆల్రెడీ సెలబ్రిటీ ప్రీమియర్ షో నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తోంది.
Also Read : రణ్‌బీర్, ఆలియాకు నల్ల బ్యాడ్జీలతో స్వాగతం - సోషల్ మీడియా నుంచి గుడికి చేరిన ఆగ్రహ జ్వాలలు
శ్రీ కార్తీక్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు 'ఒకే ఒక జీవితం' సినిమాను నిర్మించారు. ఇందులో కార్తీ ఒక పాటను పాడటం విశేషం. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా... సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, కృష్ణచైతన్య సాహిత్యం అందించారు. తెలుగులో తరుణ్ భాస్కర్ డైలాగులు రాశారు.
Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం - మణిరత్నం తీసిన విజువల్ వండర్, 'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)