Ponniyin Selvan 1 Trailer : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం - మణిరత్నం తీసిన విజువల్ వండర్, 'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్
PS1 Telugu Trailer : మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'పొన్నియన్ సెల్వన్'. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram), 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన తారలుగా రూపొందిన చిత్రం 'పొన్నియన్ సెల్వన్' (Ponniyin Selvan 1 Movie). మణిరత్నం దర్శకత్వం వహించిన దృశ్య కావ్యం ఇది. ఈ నెలాఖరున... సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ రోజు సాయంత్రం ట్రైలర్ (PS1 Trailer) విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి.
''వెయ్యి సంవత్సరాల క్రితం చోళ నాట స్వర్ణ శకం ఉదయించక మునుపు... ఒక తోక చుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళ రాజకులంలో ఒకరిని ఆ తోక చుక బలి కోరుతుందని అంటున్నారు. దేశాన్ని పగలు, ప్రతీకారాలు చుట్టుముట్టాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. వంచన, ద్రోహం రాజ మందిరంలోకి చొచ్చుకుని పోతున్నాయి'' అనే రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్ తో 'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్ ప్రారంభం అయ్యింది. అప్పటికి సినిమా ఎంత గ్రాండియర్ గా ఉంటుందనేది చూపించారు మణిరత్నం. ఆ తర్వాత ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ ను పరిచయం చేశారు. తర్వాత 'చోళ రాజ్య రక్షకుడిని. చోళ రాజ్య సేవకుడిని' అంటూ 'జయం' రవి తెరపైకి వచ్చారు.
కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్... తెరపైకి ఒక్కొక్కరూ వస్తుంటే వాళ్ళ నటనతో పాటు సినిమా గ్రాండియర్ పెరుగుతూ వచ్చింది. మణిరత్నం విజువల్ వండర్ మైండ్ నుంచి వెళ్లనని అంటుంది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించింది. మొత్తం మరో వెండితెరపై మరో అద్భుత దృశ్యకావ్యం ప్రేక్షకుల ముందుకు రానుందని సినిమా ట్రైలర్ చెప్పకనే చెప్పింది.
'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్‌కు హిందీలో అనిల్ కపూర్, తమిళంలో కమల్ హాసన్, తెలుగులో రానా దగ్గుబాటి, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, కన్నడలో జయంత్ కైకిని వాయిస్ ఓవర్ అందించారు.
మణిరత్నం సినిమా అంటే ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం కంపల్సరీ. ఈ 'పొన్నియన్ సెల్వన్'కు సైతం ఆయన సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ రెండు పాటలను విడుదల చేశారు. ఒకటి... విక్రమ్ మీద తెరకెక్కించిన 'చోళ చోళ'. రెండోది... కార్తీ మీద చిత్రీకరించిన 'పొంగే నది'. ఈ రెండు పాటలకు తమిళనాట ప్రేక్షకులను, తెలుగులో రెహమాన్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి (PS1 Audio Launch).
Also Read : కొరియన్‌లో 'ఆర్ఆర్ఆర్' రీమేక్ - ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసిన సునీత తాటి
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల వాళ్ళ లుక్స్ కూడా విడుదల చేశారు.