By: ABP Desam | Updated at : 16 Apr 2023 10:39 AM (IST)
Photo@@UV_Creations/twitter
గత కొంత కాలంగా సౌత్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా సత్తా చాటుతున్నాయి. ‘RRR’, ‘KGF’, ‘కాంతార’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు అందుకున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ సినిమా పరిశ్రమల నుంచి తెరకెక్కే చాలా సినిమాలు పాన్ ఇండియన్ చిత్రాలుగానే ఉన్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రంలో నీవినీ ఎరుగని రీతిలో ఓ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని హీరోయిన్ గా సిరుత్తై శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఫిక్స్ చేశారు.
10 భాషల్లో 3Dలో విడుదల
తమిళ నాట అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కంగువ’ అనే పేరు పెట్టారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్, సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.'కంగువ' అంటే అగ్ని లాంటి శక్తి కలిగిన వ్యక్తి, అత్యంత పరాక్రమవంతుడు. అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కామన్ టైటిల్ ఫిక్స్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి ‘కంగువ’ అనే పేరే ఉండనుంది. ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా పది భాషల్లో, 2D అండ్ 3D ఫార్మాట్స్ లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ-ప్రమోద్, జ్ఞానవేల్ రాజా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024
Title video 🔗: https://t.co/gACDnALtnz@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations pic.twitter.com/5xbguzk51f— UV Creations (@UV_Creations) April 16, 2023
2024 ప్రారంభంలో ‘కంగువ’ విడుదల
ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వెట్రి పళనిసామి, సంగీతం 'రాక్‌స్టార్' దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. మరో నెలలో బ్యాలన్స్ పూర్తి చేయనున్నారు. 3Dలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ వివిధ అవతార్‌లలో శక్తివంతమైన హీరోను చూపించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో అనేక యాక్షన్ సీక్వెన్సులు, హై ఏక్టెడ్ VFX ,CGI ఉండనున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఈ చిత్రం 2024 ప్రారంభంలో విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ ను సరిగమ సౌత్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం.
విజువల్ వండర్ గా ఫస్ట్ లుక్, టైటిల్ వీడియో
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అద్భుతమైన విజువల్ వండర్ గా ఈ చిత్రం రూపొందబోతోంది అనడానికి ఎగ్జాంఫుల్ గా నిలుస్తోంది.
Read Also: పురాణాలపై ఫొకస్ పెట్టిన మన డైరెక్టర్లు - హిందుత్వంతో హిట్ కొడతారా?
Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్
Filmfare Awards: ఆ అవార్డులను వాష్ రూమ్ హ్యాండిల్గా వాడతా - ‘ఫిల్మ్‌ఫేర్’పై నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు
Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?
Adipurush Censor Report : 'ఆదిపురుష్' సెన్సార్ కంప్లీటెడ్ - రిపోర్ట్ ఎలా ఉందంటే?
బ్రహ్మీ చాలా రిచ్ గురూ, ఈ ఇండియన్ కమెడియన్స్ ఆస్తుల్లో టాప్ బ్రహ్మానందమే!
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!
నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు