అన్వేషించండి
Advertisement
Movies On Hindu Mythology: పురాణాలపై ఫొకస్ పెట్టిన మన డైరెక్టర్లు - హిందుత్వంతో హిట్ కొడతారా?
'కార్తికేయ 2' 'అఖండ' 'కాంతారా' హిట్ అవ్వడంతో హిందూ పురాణాలు ఇతిహాసాలతో సినిమాలు తీయడానికి మన దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. హిందూ సెంటిమెంట్స్ ని క్యాష్ చేసుకునే పనిలో అందరూ బిజీగా ఉన్నారు.
ఇటీవల కాలంలో హిందూ పురాణాలు, హిందూ దేవుళ్ళు దేవతల స్పూర్తితో రూపొందించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి చిత్రాలకే పాన్ ఇండియా వైడ్ సినీ అభిమానుల ఆధరణ దక్కుతుండటంతో మన ఫిలిం మేకర్స్ అందరూ హిందుత్వం ఆధారంగా రాసుకున్న కథలను తెర మీదకు తీసుకురావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'అఖండ'. శివుడు, దేవాలయాల పరిరక్షణ అనే అంశాలను స్పృశిస్తూ తీసిన ఈ మాస్ యాక్షన్ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. అలానే నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ 2' చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. శ్రీ కృష్ణుడు - కృష్ణతత్వం - ద్వారక నగరం చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. దీనికి కొనసాగింపుగా ‘కార్తికేయ-3’ సిద్ధమవుతోంది.
కన్నడ సంస్కృతులు, సంప్రదాయాల నేపథ్యంలో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతారా' సినిమా అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన RRR సినిమా నార్త్ ఆడియన్స్ కు విపరీతంగా కనెక్ట్ అయ్యింది. రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను రాముడిగా, అలియా భట్ ను సీతమ్మగా భావించారు ఉత్తరాది జనాలు.
ఆదిపురుష్
ఇలా హిందూ పురాణాలు, చరిత్ర నేపథ్యంలో వచ్చిన సినిమాలకి ప్రజాదరణ దక్కుతుండటంతో ఇప్పుడు ఇండస్ట్రీ అంతా అదే బాటలో పయనిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో డైరక్టర్ ఓం రౌత్ 'ఆదిపురుష్' అనే మైథలాజికల్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ మూవీ తీస్తున్నారు. ఇందులో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. జూన్ రెండో వారంలో ఈ చిత్రం విడుదల కానుంది.
ప్రాజెక్ట్-K
అలానే ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' అనే పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది సైన్స్ ఫిక్షన్ సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సూపర్ హీరో సినిమా. అయితే ఇది విష్ణువు యొక్క ఆధునిక అవతారం గురించి ఉంటుందని నిర్మాత అశ్వినీ దత్ పేర్కొన్నారు. 2024 సంక్రాంతికి ఈ సినిమా ప్రంపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
శాకుంతలం
సమంత రూత్ ప్రభు టైటిల్ రోల్ లో గుణ శేఖర్ దర్శకకత్వంలో శాకుంతలం అనే సినిమా రూపొందింది. మహాభారతంలోని శకుంతల కథతో కాళిదాసు రాసిన 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా 3డీలో ఈ మైథలాజికల్ డ్రామా తెరకెక్కింది. అయితే ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది.
హను-మాన్
ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా 'హను-మాన్' అనే పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ తెరకెక్కుతోంది. ఇండియన్ రియల్ సూపర్ హీరో హనుమంతుడి స్ఫూర్తితో రాసుకున్న స్టోరీతో ఈ సినిమా తీస్తున్నారు. సమ్మర్ లో పలు ప్రధాన భారతీయ బాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. అలాగే బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ 'సీత' అనే కథ కూడా రాస్తున్నారు. రామాయణాన్ని సీతమ్మ కోణంలో చెప్పబోతున్నాడు. దీంట్లో కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేస్తోంది.
రాజమౌళి - మహేష్ బాబు మూవీ
దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ ఫారెస్ట్ బేస్డ్ అడ్వెంచర్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా SSMB29 అని పిలవబడుతున్న ఈ సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నారు. అయితే ఇందులో మహేశ్ పాత్ర హనుమంతుని నుంచి ప్రేరణ పొంది రాసుకుంటున్నట్లుగా గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తోంది.
ప్రభాస్ - ప్రశాంత్ నీల్
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కూడా హిందూ మైథాలజీ ఆధారంగా ఉంటుందని అంటున్నారు. ఇక దిల్ రాజు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా 'జటాయు' చిత్రాన్ని పేర్కొన్నారు. జటాయువు రామాయణ ఇతిహాసంలో కీలక పాత్ర అనే విషయం తెలిసిందే.
‘కాంతారా’ ప్రీక్వెల్
మరోవైపు 'కాంతారా' చిత్రానికి ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు రిషబ్ శెట్టి ప్రకటించాడు. 'కార్తికేయ 3' ఉంటుందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. 'అఖండ 2' కూడా చేస్తామని బోయపాటి - బాలయ్యలు చెపుతున్నారు. 'పుష్ప 2' సినిమాలో అమ్మోరు తల్లి గెటప్ లో అల్లు అర్జున్ అలరించనున్నాడు. ఇలా ఏదోక విధంగా హిందూ సెంటిమెంట్స్ ను క్యాష్ చేసుకునే పనిలో డైరెక్టర్లు బిజీగా వున్నారు. మరి హిందుత్వంతో హిట్ కొడతారో లేదో చూడాలి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
పాలిటిక్స్
ఆటో
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement