అన్వేషించండి
Advertisement
మన టాలీవుడ్ హీరోయిన్స్ విద్యార్హతలు తెలుసా? వీరిలో ఇద్దరు డాక్టర్లు!
వెండితెరపై తమ గ్లామర్ తో అభిమానులను అలరించే హీరోయిన్లలో మంచి ఎడ్యుకేషన్స్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినవారున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ రాణిస్తున్న హీరోయిన్ల విద్యార్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. రోజుకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతున్న పరిశ్రమలో రాణించడం మామూలు విషయం కాదు. అందం, అభినయం, టాలెంట్ తో పాటుగా కూసింత అదృష్టం కూడా ఉండాలి. ఇవన్నీ కలిసొచ్చి వెండితెరకు గ్లామర్ ను అద్దే ముద్దుగుమ్మలు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువకాలం వెలుగొందుతారు. ప్రెజెంట్ స్టార్స్ గా రాణిస్తున్న హీరోయిన్లు అంత ఆశామాషీగా రాలేదు. మంచి చదువులు చదువుకొని, సినిమా మీద ఫ్యాషన్ తో గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టారు. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లుగా కొనసాగుతున్న అందాల భామల విద్యార్హతల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం!
సమంత రూత్ ప్రభు:
దక్షిణాది అగ్ర కథనాయికలలో ఒకరుగా వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న సమంత.. చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఆమె అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ముగిసే సమయానికే మోడలింగ్ లో పాల్గొంది. ఈ క్రమంలో 2010లో 'ఏమాయ చేసావే' సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది. సినీ ఇండస్ట్రీలో పుష్కర కాలం పూర్తి చేసుకున్న సామ్.. ఇప్పుడు శాకుంతలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కీర్తి సురేశ్:
మహానటి కీర్తి సురేశ్ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె అనే సంగతి తెలిసిందే. 2000లో బాలనటిగా తెరంగేట్రం చేసిన కీర్తి.. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరవాత 2013లో 'గీతాంజలి' అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల దసరాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.
పూజా హెగ్డే:
బుట్టబొమ్మ పూజా హెగ్డే ముంబైలోని మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో స్కూలింగ్ చేసింది. MMK డిగ్రీ కాలేజీ నుండి ఎంకామ్ కంప్లీట్ చేసింది. అలానే కాలేజీ రోజుల్లో నెట్‌వర్క్ మార్కెటింగ్ సంస్థలో తన తల్లికి సహాయంగా నిలిచిందట. అదే సమయంలో ఫ్యాషన్ షోలలో పాల్గొన్న పూజా.. మిస్ ఇండియా-2009 పోటీలో పాల్గొని తొలి రౌండ్ లోనే ఎలిమినేట్ అయింది. 2010లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో రెండవ స్థానంలో నిలిచింది. ముగమూడి అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన పూజా.. ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది.
రష్మిక మందన్న:
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక.. బెంగుళూరులోని M.S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీలో సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే మోడలింగ్ లో పాల్గొన్న క్రష్మీక.. కిర్రిక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో వెండితెర మీదకి వచ్చింది. ఛలో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది.
శృతి హాసన్:
విశ్వనటుడు కమల్ హాసన్, సీనియర్ నటి సారికల కూతురైన శృతి హాసన్.. ముంబైలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. కాలిఫోర్నియాలోని మ్యూజిషియన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సంగీతం నేర్చుకుంది. ఆ తర్వాత హే రామ్ సినిమాలో క్యామియో చేసిన శృతి.. లక్ అనే హిందీ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. అనగనగా ఒక ధీరుడు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
సాయి పల్లవి:
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని అంటుంటారు కొందరు నటీనటులు. యాక్టర్ గా నటిస్తూనే డాక్టర్ కోర్సు పూర్తి చేసిన హీరోయిన్ సాయి పల్లవి. టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీ నుండి 2016లో ఆమె వైద్య విద్యను పూర్తి చేసింది. కానీ ఇంకా మెడికల్ ప్రాక్టీషనర్‌గా నమోదు చేసుకోలేదు. సాయి పల్లవి 2020 ఆగస్టులో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) లో పాస్ అయింది. ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టిన ఆమె.. ఫిదా మూవీతో తెలుగు ఆడియెన్స్ ని ఫిదా చేసింది. అంతకముందు ఢీ డ్యాన్స్ షోతో ఆకట్టుకుంది.
శ్రీలీల:
మెడిసిన్ చేస్తూ సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్స్ లో శ్రీ లీల ఒకరు. చిన్నతనంలోనే భరతనాట్యం నృత్యంలో శిక్షణ తీసుకున్న ఈ బ్యూటీ.. డాక్టర్ కావాలని ఆశ పడింది. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2021 నాటికి ఆమె MBBS చివరి సంవత్సరం చదువుతోంది. 2019లో కిస్ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయిన ఈ కుర్ర భామ.. పెళ్ళి సందడితో టాలీవుడ్ లో సందడి చేసింది. ప్రస్తుతం మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్ గా మారింది. 2022లో, లీలా ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
కృతి శెట్టి:
ముంబైలో పెరిగిన కృతి శెట్టి.. 2021 నాటికి సైకాలజీ చదువుతోంది. చదువుకునే రోజుల్లోనే ఆమె కమర్షియల్ యాడ్స్ లో నటించింది. ఇదే క్రమంలో 'సూపర్ 30' అనే హిందీ సినిమాలో కనిపించిన కృతి.. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆటో
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion