News
News
X

Yashoda: సమంత సినిమా రైట్స్ దక్కించుకున్న స్టార్ హీరో - లాభాలొస్తాయా?

హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేశారు సూర్య. ఇప్పుడు సామ్ సినిమాపై అతడి దృష్టి పడింది. 

FOLLOW US: 
 
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత(Samantha). వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద'(Yashoda) అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్(Sridevi Movies) బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. 

ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. నవంబర్ 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దీన్ని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా సినిమా రిలీజ్ కానుంది. అయితే తమిళ, మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో సూర్య దక్కించుకున్నట్లు సమాచారం. తన సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ పై 'యశోద'ను రిలీజ్ చేయబోతున్నారు సూర్య. 

హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేశారు సూర్య. అలానే తనకు కంటెంట్ నచ్చే సినిమాల రైట్స్ తీసుకొని తన బ్యానర్ జోడించి రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు సమంత సినిమాతో కొంత క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు సూర్య. మరి తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి..!

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేటర్ హక్కులను ఏషియన్ సినిమాస్ సంస్థ, దిల్ రాజు కలిసి రూ.10 కోట్లకు తీసుకున్నారు. కర్ణాటకలో సినిమాను హాట్ స్టార్ సంస్థ విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. 'కార్తికేయ2' సినిమాను బాలీవుడ్ లో విడుదల చేసిన సంస్థ హిందీ వెర్షన్ హక్కులను దక్కించుకుంది. అమెజాన్ ప్రతినిధులు సినిమా చూసి రూ.22 కోట్లకు అన్ని భాషలకు చెందిన డిజిటల్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ హక్కులు రెండు కోట్ల మేరకు అమ్ముడైనట్లు సమాచారం. శాటిలైట్ హక్కుల కోసం కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయట. 

News Reels

సమంత గర్భవతిగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నారు.  

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘ఆదిపురుష్’ విడుదల వాయిదా, తేదీ ప్రకటించిన ఓం రౌత్ - రీషూట్ కోసమేనా?

హైలైట్ గా యాక్షన్ సీక్వెన్సెస్:
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో 3 యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయట. మూడు వేటికవి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. అందులో ఓ యాక్షన్ సీన్ ని 'ఫ్యామిలీ మ్యాన్' టీమ్ కి పని చేసిన ఫారెన్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేశారు. ఈ యాక్షన్ సీన్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2కి పని చేసిన యాక్షన్ మాస్టర్లే ఈ సినిమాకి కావాలని సమంత డిమాండ్ చేయడంతో నిర్మాతలు వాళ్లతోనే వర్క్ చేయించారు. క్లైమాక్స్ కి ముందు ఓ భారీ యాక్షన్ సీన్ ఉంటుందని.. అందులో సమంత పోరాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది. స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంది. మరి ఆ యాక్షన్ ఫీట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. 

Published at : 07 Nov 2022 03:20 PM (IST) Tags: samantha Suriya Yashoda yashoda tamil malayalam release

సంబంధిత కథనాలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్