Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘ఆదిపురుష్’ విడుదల వాయిదా, తేదీ ప్రకటించిన ఓం రౌత్ - రీషూట్ కోసమేనా?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ఆదిపురుష్’. భారీ బడ్జెట్ తో రామాయణ ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఆది పురుష్’. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. జనవరి 12, 2023లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు కూడా. సడెన్ గా ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు ఓమ్ రౌత్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా జూన్ 16, 2023కి వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అద్భుతమైన గ్రాఫిక్స్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓమ్ రౌత్ తెలిపారు.
जय श्री राम…#Adipurush releases IN THEATRES on June 16, 2023.#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana @manojmuntashir @TSeries @RETROPHILES1 @UV_Creations @Offladipurush pic.twitter.com/kXNnjlEsib
— Om Raut (@omraut) November 7, 2022
విమర్శలకు దారితీసిన ‘ఆదిపురుష్’ టీజర్
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడదల అయ్యింది. అయితే, ఈ టీజరపై నానా రచ్చ జరగింది. టీజర్ లోని గ్రాఫిక్స్ పై చాలా మంది పెదవి విరిచారు. యానిమేషన్ సినిమా మాదిరగానే ఉందనే విమర్శలు వచ్చాయి. రాముడికి మీసాలు ఉండటం ఏంటని పలువురు ప్రశ్నించారు. కొందరు ఏకంగా ఈ సినిమా టీజర్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని కోర్టుకెక్కారు. దీంతో గ్రాఫిక్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ లో ఉన్నట్లు కాకుండా పూర్తి స్థాయిలో సరికొత్తగా ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మెరుగైన గ్రాఫిక్స్ కోసమే సినిమా విడుదల వాయిదా ప్రకటించారు. అటు ఈ గ్రాఫిక్స్ కోసం అదనంగా మరో రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. అలాగే కొన్ని సీన్లను ప్రభాస్‌తో రీషూట్ చేయనున్నట్లు సమాచారం. అయితే, సైఫ్ అలీ ఖాన్ రావణుడి రూపంలో ఏమైనా మార్పులు చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అదే జరిగితే మొత్తం రీషూట్ చేయాల్సి వస్తుంది.
పలు సినిమాలపై ‘ఆది పురుష్’ ఎఫెక్ట్
ఇక ఈ సినిమా విడుదల వాయిదా పలు సినిమాల మీద పడనుంది. వచ్చే ఏడాది జూన్ 2న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన ‘జవాన్’ రిలీజ్ కానుంది. అటు హాలీవుడ్ మూవీ’స్పైడర్ మ్యాన్’ సీక్వెల్ కూడా అదే తేదీని విడుదల అవుతుంది. జూన్ 9న ట్రాన్స్ ఫార్మర్స్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ లో ‘ఆదిపురుష్’ సినిమాకు ఇబ్బందులు తప్పవనే టాక్ నడుస్తున్నది. మరోవైపు ప్రభాస్ తాజా సినిమా ‘ప్రాజెక్ట్ కే’ కూడా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తున్నది. ప్రభాస్ ఆది పురుష్ ప్యాచ్ వర్స్ కోసం సుమారు నెల రోజుల పాటు సమయాన్నికేటాయించారు. ఈ నేపథ్యంలో ‘ప్రాజెక్ట్ కే’ ఆగిపోయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ‘ప్రాజెక్ట్ కే’ సినిమా 2024 జనవరిలో విడుదల కావాల్సి ఉండగా, సినిమా షూటింగ్ లో సమస్యల కారణంగా 2024 ఏప్రిల్ కు వాయిదా పడినట్లు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా కనిపించనున్నారు. రావణుడి క్యారెక్టర్ సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడి క్యారెక్టర్ లో దేవ్ దత్తా నటిస్తున్నాడు. పూర్తి స్థాయిలో గ్రీన్ మ్యాట్ మీదే షూటింగ్ జరిగింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ నడుస్తోంది. సుమారు రూ. 400 కోట్లతో ఈ సినిమా తెరెక్కుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ రూ.150 కోట్ల రెమ్యునరేష్ తీసుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!