Sonusood: మళ్లీ రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్, మెచ్చుకోకుండా ఉండలేం
కరోనాకు ముందు సోనూసూద్ ఒక సినిమా విలన్, కరోనా సమయంలో హీరోగా మారాడు.
కరోనా వచ్చాక పేద ప్రజల కష్టాలు చూసి చలించిన వ్యక్తి సోనూసూద్. సినిమాల్లో విలన్ వేషాలు వేసే సోనూసూద్ కరోనా సమయంలో చేసిన సేవాకార్యక్రమాలతో రియల్ హీరోగా మారారు. ముఖ్యంగా వలసకార్మికులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారి సొంతూళ్లకు పంపారు. వారికి భోజన వసతులు కల్పించి మంచి మనసు చాటుకున్నారు. చాలా మంది పేదల చదువుకు, ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం అందించారు. సెకండ్ వేవ్ సమయంలో దేశం అల్లకల్లోలంగా మారిన సమయంలోనూ ఆక్సిజన్ సిలిండర్లను, వెంటిలేటర్స్‌ను అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. అందుకే ఆయన రియల్ హీరో. రెండు మూడు చోట్ల ఆయనకు గుడి కట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో మొదలైన సేవాకార్యక్రమాలను ఇంకా కొనసాగిస్తున్నారు సోనూ సూద్.
సొంతూళ్లో సైకిళ్ల పంపిణీ
తన సొంతూరు అయిన పంజాబ్లోని మోగాలో ‘మోగాకి భేటి’ పేరుతో ప్రత్యేకం కార్యక్రమం చేపట్టారు. తన చెల్లెలు మాళవికతో కలిసి మోగాలోని ఆడపిల్లలకు సైకిళ్లు పంపిణీ చేశారు. దాదాపు 40 గ్రామాల్లోని ఆడపిల్లలకు ఈ సైకిళ్లను అందించారు. స్కూళ్లకి కిలోమీటర్ల పాటూ ఆడపిల్లలు నడుస్తూ వెళ్లడాన్ని సోనూసూద్ గమనించారు. ఆ కారణంగా వారు చదువు ఆపడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే 8వ తరగతి నుంచి ఇంటర్ చదివే ఆడపిల్లలకు సైకిళ్లను అందించారు. సోనూసూద్ ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ ద్వారా సేవాకార్యక్రమాలను విస్తరిస్తున్నారు.
#SonuSood distributes 1000 bicycles to school students and social workers in hometown Moga.@SonuSood 👏 pic.twitter.com/I8ijZRY7KV
— Suresh Kondi (@SureshKondi_) January 5, 2022
Also Read: అఖండ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే... ఇక బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే
Also Read: సిరికి బ్రేకప్ చెప్పనున్న శ్రీహాన్? ఇన్స్‌స్టా నుంచి సిరి ఫోటోలను తొలగించిన ప్రియుడు
Also Read: దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?
Also Read: 'సేనాపతి'కి మెగాస్టార్ రివ్యూ.. రాజేంద్రప్రసాద్ పై ప్రశంసలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.