By: ABP Desam | Updated at : 05 Jan 2022 02:05 PM (IST)
'సేనాపతి'కి మెగాస్టార్ రివ్యూ..
ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సేనాపతి'. పవన్ సాధినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా 'ఆహా'లో డిసెంబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ సినిమా '8 తొట్టక్కల్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాజేంద్రప్రసాద్ పెర్ఫార్మన్స్ ను, దర్శకుడి టేకింగ్ ను మెచ్చుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై స్పందించారు.
ట్విట్టర్ లో ఈ సినిమాను ప్రశంసిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ''సేనాపతి' చూశాను. యువదర్శకుడు పవన్ సదినేని ఎంతో ఆసక్తికరం గా, అనుక్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠభరితంగా ఉండేలా తీశాడు. మంచి అభిరుచికి అద్దంపట్టే చిత్రాన్ని నిర్మించిన యువనిర్మాతలు సుష్మిత కొణిదెల, విష్ణులకి నా ప్రేమాభినందనలు. అన్నింటికీ మించి సీనియర్ నటుడు 'నటకిరీటి' రాజేంద్రప్రసాద్ ఒక వినూత్న పాత్రలో అద్భుతంగా నటించాడు. తన నటనా ప్రతిభకి ఈ చిత్రం ఓ మచ్చు తునక. ఈ ప్రయత్నం వెనుక వున్న GOLDBOX Entertainment టీం అందరికీ నా శుభాకాంక్షలు! 'ఆహా' OTT ప్లాట్ ఫార్మ్ లో విడుదలైన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని భావిస్తున్నాను' అంటూ రాసుకొచ్చారు.
రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఈ సినిమాలో నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కండ్రేగుల, హర్షవర్ధన్, రాకేందు మౌళి, 'జోష్' రవి, సత్యప్రకాష్, పావని రెడ్డి, జీవన్ కుమార్ తదితరులు నటించారు.
Hearty Congrats Team #SENAPATHI !!
A terrific thriller!#SenapathionAha #DrRajendraPrasad @Pavansadineni #LSVishnuPrasad@sushkonidela @ahavideoIN pic.twitter.com/WJcSBeqhK3— Chiranjeevi Konidela (@KChiruTweets) January 5, 2022
Also Read: 'రాధేశ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?
Also Read: పూల్‌లోకి దూకిన నటి.. పాపం మెడ విరిగింది
Also Read: బాలయ్య కోసం 'క్రాక్' లేడీ.. లక్ కలిసొస్తుందా..?
Also Read:ఫ్యాన్స్ కి షాకిచ్చిన ప్రభాస్.. 'ఆర్ఆర్ఆర్' రూట్ లోనే 'రాధేశ్యామ్'..
Also Read: హీరోగా ఎన్టీఆర్ బావమరిది.. డైరెక్టర్ ఎవరంటే..?
Also Read: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్
O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్