By: ABP Desam | Updated at : 05 Jan 2022 11:44 AM (IST)
బాలయ్య కోసం 'క్రాక్' లేడీ..
నందమూరి బాలకృష్ణ ఇటీవల 'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికీ కొన్ని ఏరియాలలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతోంది.
ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. వందేళ్ల కాలం నుంచి వేటపాలెంకు సంబంధించిన వార్తా పత్రికలన్నీ తిరగేసి ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నారు దర్శకుడు గోపీచంద్. కథ ప్రకారం.. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్ గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.
ఇక ఈ సినిమా కోసం కొందరు టాలెంటెడ్ స్టార్స్ ను తీసుకొస్తున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇప్పటికే విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ ని కన్ఫర్మ్ చేసినట్లుగా ఓ పోస్టర్ ను వదిలారు. తాజాగా మరో నటి ఈ సినిమాలో భాగమైంది. ఆమె మరెవరో కాదు.. వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ కోలీవుడ్ భామ ఈ మధ్యకాలంలో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది.
గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన 'క్రాక్' సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు మరోసారి ఆమెకి ఛాన్స్ ఇచ్చారు దర్శకుడు. మరి ఈసారి కూడా వరలక్ష్మీ లక్ ను తీసుకొస్తుందేమో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'జై బాలయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కొన్నిరోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
Team #NBK107 welcomes the most talented & versatile actress @varusarath5 on board 💥💥
NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @megopichand @MusicThaman pic.twitter.com/0KjcvVtsKZ — Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2022
Also Read:ఫ్యాన్స్ కి షాకిచ్చిన ప్రభాస్.. 'ఆర్ఆర్ఆర్' రూట్ లోనే 'రాధేశ్యామ్'..
Also Read: హీరోగా ఎన్టీఆర్ బావమరిది.. డైరెక్టర్ ఎవరంటే..?
Also Read: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ..
Also Read: 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ రోల్ ఇదే.. రివీల్ చేసిన నిర్మాత..
Also Read: సంక్రాంతి రేసులో డబ్బింగ్ సినిమాలు.. అజిత్ Vs విశాల్..
Also Read: ఇది చాలా టఫ్ టైం.. 'రాధేశ్యామ్' దర్శకుడు హింట్ ఇస్తున్నాడా..?
NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!