Prabhas: 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ రోల్ ఇదే.. రివీల్ చేసిన నిర్మాత..
'స్పిరిట్' కథ ప్రకారం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'రాధేశ్యామ్' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా ఆయన ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగశ్విన్ తో కలిసి 'ప్రాజెక్ట్ కె' వంటి సినిమాలు చేయబోతున్నారు. వీటితో పాటు 'అర్జున్ రెడ్డి' ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.
దీనికి 'స్పిరిట్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 'ఆదిపురుష్' సినిమాను నిర్మిస్తోన్న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ ను కూడా టేకప్ చేశారు. ప్రభాస్ కెరీర్ లో మైల్ స్టోన్ 25వ సినిమాగా 'స్పిరిట్' మొదలుకానుంది. ఈ సినిమాను హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్ గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా వుండబోతుందనే విషయాన్ని నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
'స్పిరిట్' కథ ప్రకారం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట. తొలిసారి ప్రభాస్ పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ కటౌట్ కి పోలీస్ ఆఫీసర్ రోల్ యాప్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఈ న్యూస్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు మేకర్స్.
సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ ను వెండితెరపై ఏ రేంజ్ లో చూపిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా మొదలుకానుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి 'యానిమల్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ప్రభాస్ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ప్రభాస్ కాల్షీట్స్ ను బట్టి రెగ్యులర్ షూటింగ్ ప్లానింగ్ చేయనున్నారు.
Also Read: సంక్రాంతి రేసులో డబ్బింగ్ సినిమాలు.. అజిత్ Vs విశాల్..
Also Read: ఇది చాలా టఫ్ టైం.. 'రాధేశ్యామ్' దర్శకుడు హింట్ ఇస్తున్నాడా..?
Also Read: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..
Also Read: రాజమౌళితో కరణ్ జోహార్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?
Also Read: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..
Also Read: 'నాయట్టు' రీమేక్.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?