Sankranti 2022: సంక్రాంతి రేసులో డబ్బింగ్ సినిమాలు.. అజిత్ Vs విశాల్..
ఈ సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
ఈ ఏడాది సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' లాంటి పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ 'ఆర్ఆర్ఆర్' సినిమా వాయిదా పడింది. ఇప్పుడు 'రాధేశ్యామ్' కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడిందని అనౌన్స్మెంట్ రాగానే.. చిన్న సినిమాలు రిలీజ్ కి క్యూ కట్టాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతికి అరడజనుకి పైగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి.
వీటితో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయని తెలుస్తోంది. విశాల్ హీరోగా 'సామాన్యుడు' అనే సినిమా తెరకెక్కుతోంది. తు.ప.శరవణన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
Actor/Producer #Vishal is planning to release #VeerameVaagaiSoodum for #Pongal2022 on Jan 14th..
— S Abishek Raaja (@cinemapayyan) January 4, 2022
Let’s wait for the official update from the production side!!!#வீரமேவாகைசூடும்#Saamaanyudu @VishalKOfficial @VffVishal @DimpleHayathi @thisisysr @Thupasaravanan1 @Ponparthiban pic.twitter.com/7BOsP6FGuA
విశాల్ సినిమాతో పాటు అజిత్ 'వాలిమై' కూడా రాబోతుంది. ఒకరోజు ముందుగా జనవరి 13న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అజిత్ సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండడంతో ఇక్కడ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయన్నమాట.
Experience the POWER OF #VALIMAI, in Tamil, Telugu and Hindi. Releasing Worldwide on 13th January 2022.#AjithKumar #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @sureshchandraa @ActorKartikeya #ValimaiFromPongal #ValimaiFromJan13 pic.twitter.com/crMZfBTZFH
— Boney Kapoor (@BoneyKapoor) January 4, 2022
Also Read: ఇది చాలా టఫ్ టైం.. 'రాధేశ్యామ్' దర్శకుడు హింట్ ఇస్తున్నాడా..?
Also Read: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..
Also Read: రాజమౌళితో కరణ్ జోహార్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?
Also Read: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..
Also Read: 'నాయట్టు' రీమేక్.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?
Also Read: రోజుకి కోటి రూపాయలా..? నిర్మాతకు షాకిచ్చిన విజయ్ సేతుపతి..