అన్వేషించండి

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే అంత ఈజీకాదు. ఎన్నో అవమానాలను, మరెన్నో సవాళ్లను తట్టుకుని నిలబడినప్పుడే విజయం చెంతకు చేరుతుంది. ‘సీతారామం’ నటీమణి మృణాల్‌ ఠాకూర్‌ సైతం ఎన్నో సినిమా కష్టాలను పడింది!

తాజాగా విడుదలై చక్కటి విజయాన్ని అందుకున్న సినిమా ‘సీతారామం’. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్.. తన పాత్రలో ఇట్టే ఒదిగిపోయింది. తన దర్పంతో పాటు ప్రేమ, సిగ్గును మేళవించి జీవించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో నటిగా సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. అయితే, మృణాల్ ఈ స్థాయికి చేరేందుకు ఎన్నో అవస్థలు పడింది. సినిమాలో సీత మాదిరిగానే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది. ఒకానొక సమయంలో చనిపోవాలనే కఠిన నిర్ణయానికి వచ్చింది. ఇంతకీ తనకు ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసుకుందాం..  

మృణాల్ పుట్టి పెరిగిందంతా మహారాష్ట్రలోని ధులెలో. తండ్రి బ్యాంకు ఉద్యోగి. నిత్యం ట్రాన్స్ ఫర్స్ అయ్యేవి. ఇంటర్ వరకే పది స్కూళ్లు మారింది. ఇంటర్ తర్వాత డెంటిస్ట్ కావాలని ఉండేది. ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాసి మంచి ర్యాంకు తెచ్చుకున్నా..  మీడియాలోకి రావాలనుకుంది.  ఇంట్లో ఒప్పుకోలేదు. అయినా, నచ్చిన పనే చేయాలని భావించి.. ‘3 ఇడియట్స్‌‘ సినిమా చూపించి తల్లిదండ్రులను ఒప్పించింది. మళ్లీ తన తండ్రి బదిలీ కావడంతో ముంబైలో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు చాలా ఒంటరిగా ఫీలయ్యేది. చదువు మీద ఫోకస్ పెట్టలేకపోయేది. మీడియా తనకు కరెక్ట్ కాదనుకుంది. పలు ఆలోచనలతో  డిప్రెషన్‌లోకి వెళ్లింది. పలుమార్లు చనిపోవాలనే ఆలోచన వచ్చేది. కానీ, తల్లిదండ్రుల కోసం వెనక్కి తగ్గింది.

అదే సమయంలో మృణాల్ సినిమాల్లోకి రావాలి అనుకున్నది. చదువుకుంటూనే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది.  ఓ షోలో తనను చూసిన ఓ దర్శకుడు 2012లో ‘ముఝే కుఛ్‌ కెహ్‌తీ హై ఖామోషియా’ అనే సీరియల్‌లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత  ‘కుంకుమ భాగ్య’ సీరియల్ తో పలు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్  చేస్తూనే సినిమా ఆడిషన్స్‌కూ వెళ్లేది. చాలా చోట్ల తనకు అవమానాలు ఎదురయ్యాయి. చివరకు ‘సుల్తాన్‌’లో అవకాశం వచ్చింది. సల్మాన్‌ ఖాన్‌ పక్కన అనుష్క పోషించిన పాత్రలో ఈమె నటించాల్సి ఉన్నా, ఎందుకో చేజారిపోయింది. ఆ తర్వాత ‘లవ్‌ సోనియా’లో అవకాశం వచ్చింది. వ్యభిచార రొంపిలోకి దిగిన మహిళల బాధలను ఇతివృత్తంగా తీసుకుని చేసిన  సినిమా ఇది. ఇందులో తను వ్యభిచార కూపంలో చిక్కుకున్న యువతిగా నటించింది. ఈ సినిమా తన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. చాలా దేశాల ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.  

‘లవ్‌ సోనియా’ తరవాత మృణాల్ కు మంచి అవకాశాలు వచ్చాయి.  ‘సూపర్‌ 30’, ‘బాట్లా హౌస్‌’, ‘తూఫాన్‌’, ’ధమాకా’, ‘జెర్సీ’ల్లో నటించింది.  పలు వెబ్‌సిరీస్‌లూ చేసింది.  తాజాగా వచ్చిన  ‘సీతారామం’ తన కెరీర్ లోనే మర్చిపోలేని మెమరబుల్ విజయాన్ని అందించింది.  చిన్నప్పుడు  ఈమెకు హృతిక్‌ రోషన్‌, షాహిద్‌ కపూర్‌ అంటే ఎంతో ఇష్టపడేదట. వాళ్ల ఫొటోల్ని చించి పుస్తకాల్లో పెట్టుకుని చూసుకునేదట. వాళ్లతో  సినిమాలు చేసే అవకాశం వస్తే ఎంతో సంతోష పడతానని చెప్పింది మృణాల్ ఠాకూర్. ఇవన్నీ మృణాల్‌ ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 

Also read: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి, అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!

Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tara Sutaria: కపూర్ హీరోతో తారా సుతారియా డేటింగ్... వీర్ పహారియాతో బ్రేకప్ తర్వాత కొత్త చాప్టర్ మొదలు?
కపూర్ హీరోతో తారా సుతారియా డేటింగ్... వీర్ పహారియాతో బ్రేకప్ తర్వాత కొత్త చాప్టర్ మొదలు?
Jana Nayagan OTT: విజయ్ 'జన నాయగన్'కు అమెజాన్ షాక్ ఇచ్చిందా? డీల్ వేల్యూ సగానికి పడిందా?
విజయ్ 'జన నాయగన్'కు అమెజాన్ షాక్ ఇచ్చిందా? డీల్ వేల్యూ సగానికి పడిందా?
8 Hour Shift: దీపికా పదుకోన్‌కు హిందీ సీరియల్ నటి దీపికా సింగ్ కౌంటర్?
దీపికా పదుకోన్‌కు హిందీ సీరియల్ నటి దీపికా సింగ్ కౌంటర్?
Memu Copulam Web Series : కులం పేరు కాదు... 'మేము COPలం' - నాగబాబు సిరీస్‌పై గెటప్ శ్రీను క్లారిటీ
కులం పేరు కాదు... 'మేము COPలం' - నాగబాబు సిరీస్‌పై గెటప్ శ్రీను క్లారిటీ

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 CSK VS MI Result Update: ముంబై ఔట్..! 'ఎల్ క్లాసికో' లో చెన్నై చేతిలో మ‌ళ్లీ ఓట‌మి.. స‌త్తా చాటిన రుతురాజ్, కార్తీక్, కాంభోజ్.. 
ముంబై ఔట్..! ఎల్ క్లాసికో లో చెన్నై చేతిలో మ‌ళ్లీ ఓట‌మి.. స‌త్తా చాటిన రుతురాజ్, కార్తీక్, కాంభోజ్.. 
Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
CM Revanth Reddy: వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
Vijayawada Crime News: కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
Viral Video: సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
Kavitha Meet the Press: కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
8 Hour Shift: దీపికా పదుకోన్‌కు హిందీ సీరియల్ నటి దీపికా సింగ్ కౌంటర్?
దీపికా పదుకోన్‌కు హిందీ సీరియల్ నటి దీపికా సింగ్ కౌంటర్?
Nani supports Pawan: పవన్ కల్యాణ్ స్వచ్ఛరథానికి నాని సపోర్ట్ - జనసేన స్పందన వైరల్
పవన్ కల్యాణ్ స్వచ్ఛరథానికి నాని సపోర్ట్ - జనసేన స్పందన వైరల్
Embed widget