Colours Swathi: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి, అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!
విడాకుల కోసం కలర్స్ స్వాతి కోర్టు మెట్లు ఎక్కింది. 20 ఏండ్ల వైవాహిక జీవింలో ఎన్నో కష్టాలు అనుభవించానని, ఇక వాటిని భరించే ఓపిక లేదంటూ కంటతడి పెట్టింది.
టాలీవుడ్ చలాకీ బ్యూటీ కలర్స్ స్వాతి భర్త నుంచి విడాకులు కావాలంటూ న్యాయస్థానాన్ని వేడుకుంది. పెద్దలు నెత్తి నోరు బాదుకున్నా వినకుండా తాగుబోతును పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. 20 ఏండ్ల సంసారం తర్వాత డివోర్స్ కోసం కోర్టు గడపతొక్కింది. రెండు దశాబ్దాల్లో తాను ఎన్నో బాధలు పడ్డానని.. ఇంకా వాటిని అనుభవించలేనని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమకు కూడా ఓపిక ఉంటుంది. ఆ ఓపిక ఇప్పుడు పోయిందని చెప్పింది. ఇంతసేపు.. మీరు విన్న కథ వాస్తవం అనుకోకండి. జస్ట్.. సినిమా స్టోరీ. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ’మంత్ ఆఫ్ మధు’. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క్రిష్వి ప్రొడక్షన్స్, హ్యండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్స్‌పై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నాడు.
తాజాగా రిలీజైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేమ, పెళ్లి, విడాకుల మేళవింపుగా ఈ సినిమా తెరెక్కింది. ఈ టీజర్ లో కలర్స్ స్వాతి మాటలు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. తాగుబోతు నవీన్ తో ప్రేమలో పడిన స్వాతి.. అతడినే పెళ్లి చేసుకుంటుంది. తాగుడుకు బానిసైన నవీన్ తో 20 ఏండ్లు సంసారాన్ని లాగించినా.. ఇక ముందు భరించే ఓపిక తనకు లేదంటూ విడాకులు కోరుతుంది. 20 ఏండ్ల బాధను 20 నిమిషాల్లో చెప్పలేను అనే డైలాగ్ ఆడియెన్స్ గుండెలకు నేరుగా తాకుతుంది. ఇంతకీ వారు పడ్డ కష్టాలేంటి? విడాకులు తీసుకుంటారా? కలిసిపోతారా? అనేది సినిమాలో చూడాలి.
View this post on Instagram
కలర్స్ స్వాతి వైవాహిక జీవితంపై అనుమానాలు!
కాసేపు సినిమా విషయాన్ని పక్కన పెడితే.. నటి స్వాతి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. భర్తతో ఆమె విడాకులు తీసుకోబోతోందంటూ ఊహాగానాలు వచ్చాయి. తన సోషల్ మీడియా అకౌంట్స్ లో భర్త ఫోటోలను తొలగించడం ఈ అనుమానాలకు తావిచ్చింది. 2018లో తన ప్రియుడు వికాస్‌ని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నది. రెండేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి తన సోషల్ మీడియాలో నుంచి భర్త ఫోటోలను తొలగించింది. దీంతో స్వాతి, వికాస్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయనే వార్తలు వచ్చాయి. త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. 2020లో ఈ వార్తలు వచ్చినా.. ఆ తర్వాత సైలెంట్ అయ్యాయి. కలర్స్ ప్రోగ్రాం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.