అన్వేషించండి

Save The Tigers 2 Trailer: ఈసారి మరింత కామెడీతో ‘సేవ్ ది టైగర్స్ 2’- ట్రైలర్ చూస్తే పొట్టచక్కలు కావాల్సిందే!

గతేడాది ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించిన ‘సేవ్ ది టైగర్స్‘ సిరీస్, మరింత ఫన్ తో మళ్లీ రాబోతోంది. త్వరలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘సేవ్ ది టైగర్స్ 2’ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Save The Tigers 2 Trailer: ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌ఠం, చైత‌న్య కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్‘. భార్యల చేతిలో నలిగిపోతున్న భర్తల బాధలు ఎలా ఉంటాయో చూపిస్తూ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా గత సంవత్సరం ఏప్రిల్ లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆరు ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులని నవ్వించి మెప్పించింది. పావని,  సుజాత, దేవయాని భర్తలను హింసించే భార్యాలుగా నటించి మెప్పించారు. శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.

‘సేవ్ ది టైగర్స్ 2’ ట్రైలర్ విడుదల

గత ఏడాది వచ్చిన ‘సేవ్ ది టైగర్స్‘ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకోవడంతో, సీజన్ 2 ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ‘సేవ్ ది టైగర్స్ 2‘ గురించి కీలక ప్రకటన చేసింది డిస్నీప్లస్ హాట్ స్టార్.  త్వరలో స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ తొలి సీజన్ తో పోల్చితే మరింత ఫన్ అందించబోతున్నట్లు కనిపిస్తోంది. మొదటి సీజన్ ఎక్కడితో ముగిసిందో దాన్ని గుర్తు చేస్తూ పోలీసుల దగ్గర ఇంట్రాగేషన్‌తో ట్రైలర్ ప్రారంభం అయింది. అభినవ్, చైతన్య, ప్రియదర్శిలను లాకప్‌లో పోలీసులు చితక్కొడతారు. ‘ఇప్పుడు చెప్పండ్రా హంస లేఖ ఏడ? అని పోలీసు పాత్రలో ఉన్న శ్రీకాంత్ అయ్యంగార్ అడుగుతాడు. ఫస్ట్ సీజన్‌ లో జరిగింది గుర్తు చేసుకున్న ప్రియదర్శి నాకు యాదికి వచ్చిందని చెబుతూ ట్రైలర్ స్టార్ట్ చేశారు. ఇక 7 ఇయర్స్ ఇచ్ తో భర్తలు అఫైర్స్ పెట్టుకుంటారంటూ కొత్త కథ మొదలు పెట్టారు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఔట్ అండ్ ఔట్ కామెడీతో ఇంట్రెస్టింగ్‌ గా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. మొత్తంగా మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వేంచేందుకు ‘సేవ్ ది టైగర్స్ 2’ సీజన్ రెడీ అయ్యింది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

మార్చి 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో స్ట్రీమింగ్

‘సేవ్ ద టైగర్స్ 2’కు అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించగా మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతమ్ క్రియేటర్స్‌ గా వ్యవహరిస్తున్నారు. అజయ్ అరసాడ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ లో నటించిన వారితో పాటు లేటెస్ట్ సిరీస్ లో సీరత్ కపూర్, ముక్కు అవినాష్, జబర్దస్త్ వేణు సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సేవ్ ది టైగర్స్ 2’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Read Also: ‘రామయణం’ నుంచి అదిరిపోయే అప్ డేట్, శ్రీరామ నవమి రోజున కీలక ప్రకటన!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Politics: జనసేనలో ఏం జరుగుతోంది? కేడర్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?
జనసేనలో ఏం జరుగుతోంది? కేడర్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?
Telangana High Court: సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
IPL Held Date Change: ఐపీఎల్ నిర్వహణ తేదీ మార్పు.. కొత్త డేట్ పై అప్డేట్ ఇచ్చిన లీగ్ చైర్మన్
ఐపీఎల్ నిర్వహణ తేదీ మార్పు.. కొత్త డేట్ పై అప్డేట్ ఇచ్చిన లీగ్ చైర్మన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbha Mela 2025 | అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళాకు రూట్ మ్యాప్ | ABP DesamBumrah ICC Mens Test Cricketer of The Year | బౌలింగ్ తో అదరగొట్టాడు..ఐసీసీ కిరీటాన్ని ఒడిసి పట్టాడు | ABP DesamBaba Ramdev Maha Kumbh Mela Yoga | మహా కుంభమేళాలో యోగసేవ చేస్తున్న బాబా రాందేవ్ | ABP DesamAmit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Politics: జనసేనలో ఏం జరుగుతోంది? కేడర్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?
జనసేనలో ఏం జరుగుతోంది? కేడర్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?
Telangana High Court: సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
IPL Held Date Change: ఐపీఎల్ నిర్వహణ తేదీ మార్పు.. కొత్త డేట్ పై అప్డేట్ ఇచ్చిన లీగ్ చైర్మన్
ఐపీఎల్ నిర్వహణ తేదీ మార్పు.. కొత్త డేట్ పై అప్డేట్ ఇచ్చిన లీగ్ చైర్మన్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
PM Modi And Trump Talk Over Phone:డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే! 
డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే! 
Crime News: మీర్‌పేట్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్- నిందితుడు కుక్కర్‌ వాడకుండా డెడ్‌బాడీ ఇలా మాయం చేశాడు!
మీర్‌పేట్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్- నిందితుడు కుక్కర్‌ వాడకుండా డెడ్‌బాడీ ఇలా మాయం చేశాడు!
Embed widget