Sara Ali Khan: 'హీజ్ హాట్..' విజయ్ దేవరకొండపై సారా అలీఖాన్ రియాక్షన్..
రీసెంట్ గా సారా అలీఖాన్.. విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. 'హీజ్ హాట్' అంటూ కామెంట్ చేసింది.
![Sara Ali Khan: 'హీజ్ హాట్..' విజయ్ దేవరకొండపై సారా అలీఖాన్ రియాక్షన్.. Sara Ali Khan about Vijay Deverakonda Sara Ali Khan: 'హీజ్ హాట్..' విజయ్ దేవరకొండపై సారా అలీఖాన్ రియాక్షన్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/e31d893d49bce8b600d7c6fae8a4a7f3_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా ఈ హీరోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యంగ్ హీరోయిన్లు జాన్వీ కపూర్, సారా అలీఖాన్ లాంటి వాళ్లయితే సందర్భం దొరికిన ప్రతీసారి విజయ్ దేవరకొండని పొగుడుతూనే ఉంటారు. రీసెంట్ గా సారా అలీఖాన్.. విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. 'హీజ్ హాట్' అంటూ కామెంట్ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన 'సింబా' సినిమా కమర్షియల్ గా భారీ విజయాన్ని అందుకుంది. లాక్ డౌన్ లో ఆమె నటించిన 'కూలీ నెంబర్ 1' విడుదలైంది. ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అయినప్పటికీ.. సారాకు చెప్పుకోదగ్గ సినిమా అవకాశాలే వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ అక్షయ్ కుమార్, ధనుష్ లతో కలిసి 'ఆత్రంగీరే' అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించింది సారా అలీఖాన్. ఈ ఇంటర్వ్యూలో ఆమె విజయ్ దేవరకొండ గురించి మాట్లాడింది.
చాలా రోజులుగా విజయ్ దేవరకొండతో ఛాన్స్ కోసం చూస్తున్నానని.. తను చాలా గొప్ప నటుడని.. కూల్ పెర్సన్ అని అలానే చాలా హాట్ గా కూడా ఉంటాడంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read: 'నయీం డైరీస్'పై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం... టీమ్ ఏమంటోందంటే?
Also Read: హమ్మయ్య.. ఆ ‘శబ్దాలు’ తగ్గుతాయ్.. కత్రినా-విక్కీలపై అనుష్క కొంటె కామెంట్స్
Also Read: వరుణ్ తేజ్ 'గని' విడుదల వాయిదా... ఎందుకంటే?
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
Also Read: 'గమనం' రివ్యూ : సినిమా ఎలా ఉందంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)