Samantha: పోటీ నుంచి తప్పుకుంటున్న సమంత - త్వరలోనే క్లారిటీ?
సమంత 'యశోద' సినిమా వాయిదా పడబోతున్నట్లు సమాచారం.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు.
చాలా రోజుల క్రితమే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఆగస్టు 12న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన తరువాత 'లాల్ సింగ్ చద్దా', 'కోబ్రా', 'మాచర్ల నియోజకవర్గం', 'లాఠీ' వంటి సినిమాలు క్యూ కట్టాయి. అఖిల్ 'ఏజెంట్' సినిమా కూడా అదే సమయానికి రావాలనుకుంటుంది. లాంగ్ వీకెండ్ కావడంతో నిర్మాతల దృష్టి ఆ డేట్ పై పడింది. అయితే ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తే.. థియేటర్లు పంచుకోవాల్సి వస్తుంది.
ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రావు. దీంతో ఇప్పుడు సమంత 'యశోద' సినిమాను వాయిదా వేయాలనుకుంటున్నారు. నిజానికి సమంత ఈ రేసు నుంచి తప్పుకుంటుందని ఎవరూ ఊహించలేదు కానీ ఇన్ని సినిమాలతో పోటీగా కాకుండా సోలోగా రిలీజ్ చేస్తే తమ సినిమాకి లాభాలొస్తాయని భావిస్తున్నారు నిర్మాతలు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ
View this post on Instagram