News
News
X

GA2 Pictures New Movie: మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ

మెగా ఫ్యామిలీ నుంచి మరొక నిర్మాత వస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తూ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు.

FOLLOW US: 

మెగా కుటుంబం నుంచి మరొక నిర్మాత వస్తున్నారు. అదీ మహిళా నిర్మాత! మెగా ఫ్యామిలీ నుంచి సుష్మితా కొణిదెల, నిహారిక నిర్మాణ రంగంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కజిన్ విద్యా మాధురి కూడా నిర్మాణంలో అడుగుపెట్టారు. ఈ రోజు ఆమె ఒక నిర్మాతగా కొత్త సినిమా మొదలైంది.
 
స్వర్గీయ అల్లు రామలింగయ్యకు విద్యా మాధురి స్వయానా మనవరాలు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు అక్క కుమార్తె. కొణిదెల ప్రొడక్షన్స్‌లో కొన్ని రోజులు నిర్మాణ పనులు పర్యవేక్షించారు. ఇప్పుడు మేనకోడలు అయిన విద్యా మాధురిని (Producer Vidhya Madhuri) నిర్మాతగా పరిచయం చేస్తూ... అల్లు అరవింద్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. 

అల్లు అరవింద్ సమర్పణలో 'బన్నీ' వాస్, విద్య మాధురి నిర్మాత‌లుగా... జీఏ 2 పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 8 ఈ రోజు హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌ స‌న్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. 'బన్నీ' వాస్ కుమార్తె బేబీ హన్విక క్లాప్ కొట్టారు. 'జోహార్', 'అర్జున ఫల్గుణ' చిత్రాలు తీసిన తేజా మార్ని ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన తారాగణం. 

Also Read : పోలీసులకు కంప్లైంట్ చేసిన పవిత్రా లోకేష్

కంటెంట్ బేస్డ్ చిత్రమిదని, కథే ప్రధానంగా సినిమా తెరకెక్కిస్తున్నామని నిర్మాత 'బన్నీ' వాస్ తెలిపారు. మురళీ శర్మ, బెనర్జీ, పవన్ తేజ్ కొణిదెల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, సహ నిర్మాత‌: భాను ప్ర‌తాప్, సినిమాటోగ్రాఫర్: జగదీష్ చీకటి. 

Also Read : పవన్ కళ్యాణ్‌కు పది కోట్లు ఎక్కువ ఇవ్వడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు

View this post on Instagram
 
A post shared by GA2 Pictures (@ga2pictures)

Published at : 30 Jun 2022 12:50 PM (IST) Tags: Allu Aravind bunny vasu Vidya Madhuri As Producer GA2 Pictures New Movie One More Producer From Mega Family Mega Cousin Vidya Madhuri

సంబంధిత కథనాలు

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

Dj Tillu 2: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

Dj Tillu 2: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!