Pavitra Lokesh: పోలీసులకు కంప్లైంట్ చేసిన పవిత్రా లోకేష్
పవిత్రా లోకేష్ పేరు కొన్ని రోజులుగా వార్తల్లో వినబడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.
తెలుగు ప్రేక్షకులకు పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) సుపరిచితురాలు. పలు విజయవంతమైన తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. నటిగా పవిత్రా లోకేష్‌కు మంచి పేరు ఉంది. అయితే... సినిమాల్లో కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో ఈ మధ్య ఆమె పేరు వార్తల్లో ఎక్కువ వినిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆమె కంప్లైంట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.
సోషల్ మీడియాలో తన పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడంతో పాటు తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు చేస్తున్నారని కర్ణాటకలోని మైసూర్‌లో సైబర్ క్రైమ్ పోలీసులకు పవిత్రా లోకేష్ కంప్లైంట్ చేశారు. అలాగే, తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవిడ ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు.
Also Read : పవన్ కళ్యాణ్‌కు పది కోట్లు ఎక్కువ ఇవ్వడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు
ప్రముఖ తెలుగు నటుడు, విజయ నిర్మల కుమారుడు నరేష్‌ను పవిత్రా లోకేష్ (Naresh Pavitra Lokesh) రహస్యంగా వివాహం చేసుకున్నారని కొంత మంది... వాళ్లిద్దరూ సహ జీవనం చేస్తున్నారని మరి కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికి తోచింది వారు పోస్టులు చేస్తుండటంతో ఈ విధంగా పవిత్రా లోకేష్ స్పందించారు.
నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి విషయం కన్నడనాట కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఆమె కన్నడలో సినిమాలు చేయడంతో పాటు ఆమె తండ్రి లోకేష్ కన్నడ నటుడు కావడం కూడా అందుకు ఒక కారణం.
Also Read : పూరి జగన్నాథ్‌తో హ్యాట్రిక్‌కి విజయ్ దేవరకొండ రెడీ?
View this post on Instagram