Vijay Devarakonda New Movie Update: పూరి జగన్నాథ్‌తో హ్యాట్రిక్‌కి విజయ్ దేవరకొండ రెడీ?
Vijay Devarakonda and Puri Jagannadh ready for hattrick: విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అంటే... తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాల నుంచి 'అవును' అనే సమాధానం వినబడుతోంది. 'జన గణ మణ' తర్వాత మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట. అసలు వివరాల్లోకి వెళితే...
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కలిసి 'లైగర్' చేశారు. ఇంకా ఆ సినిమా విడుదల కాలేదనుకోండి. కరోనా వల్ల చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. అయితే... ఇప్పుడు కంప్లీట్ చేశారనుకోండి. పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్ వల్ల ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆ సినిమా విడుదలకు ముందే 'జన గణ మణ' (JGM Movie) స్టార్ట్ చేశారు.
ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే... 'లైగర్', 'జన గణ మణ' తర్వాత మరో సినిమా చేయాలని విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారట. ఆ సినిమా ఎలా ఉంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ సినిమా నిర్మాతలలో ఛార్మి ఉంటారని తెలుస్తోంది. మరొక నిర్మాణ సంస్థతో కలిసి పూరి కనెక్ట్స పతాకంపై సినిమా నిర్మించే అవకాశాలు ఉన్నాయి.
Also Read : తమిళ దర్శకుడితో ఉస్తాద్ రామ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్
పూరి స్పీడు గురించి సినీ ఇండస్ట్రీ జనాలకు మాత్రమే కాదు... కామన్ ఆడియన్స్‌కు కూడా తెలుసు. నెక్స్ట్ ఇయర్ విజయ్ దేవరకొండతో హ్యాట్రిక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లి, వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనేది పూరి జగన్నాథ్ ప్లాన్ అట.
Also Read : ఎన్టీఆర్ అభిమాని ఆరోగ్య పరిస్థితి విషమం... ఫోన్ చేసి మాట్లాడిన హీరో!
View this post on Instagram