![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ram Pothineni : తమిళ దర్శకుడితో ఉస్తాద్ రామ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్
ఇప్పుడు తమిళ దర్శకుడు లింగుస్వామితో 'ది వారియర్' సినిమా చేస్తున్నారు ఉస్తాద్ రామ్ పోతినేని. దీని తర్వాత ఆయన మరో తమిళ దర్శకుడితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
![Ram Pothineni : తమిళ దర్శకుడితో ఉస్తాద్ రామ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ Ram Pothineni to team up with Gautham Vasudev Menon for Romantic Entertainer Ram Pothineni : తమిళ దర్శకుడితో ఉస్తాద్ రామ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/528bf137807be175a39dca55565998ba_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జస్ట్ తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా... పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఒక జానర్‌కు పరిమితం కాకుండా డిఫరెంట్ జానర్ ఫిలిమ్స్ చేస్తూ... ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని తాపత్రయం ఆయన సినిమాల ఎంపికలో స్పష్టం అవుతోంది.
ఇప్పుడు తమిళ దర్శకుడు లింగుస్వామితో రామ్ 'ది వారియర్' చేస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. హిందీలోనూ రామ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది కాబట్టి డబ్బింగ్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీని తర్వాత మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ తీయడంలో గౌతమ్ మీనన్ స్పెషలిస్ట్. యాక్షన్ ఫిలిమ్స్ కూడా సపరేట్ స్టైల్‌లో ఉంటాయి. రొమాంటిక్ సినిమాల్లో యాక్షన్ సీన్స్‌ను కూడా డిఫరెంట్‌గా తీస్తారు. ఆయనతో రామ్ సినిమా చేస్తారని కొన్ని రోజుల క్రితం వినిపించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. అయితే... రామ్, గౌతమ్ వాసుదేవ మీనన్ (Gautham Vasudev Menon Met Tollywood Hero Ram) ఇటీవల కలిశారట. ఇద్దరూ ఒక కథ గురించి డిస్కస్ చేశారట. వచ్చే ఏడాది వేసవి తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళుతుందని టాక్.
Also Read : ఎన్టీఆర్ అభిమాని ఆరోగ్య పరిస్థితి విషమం... ఫోన్ చేసి మాట్లాడిన హీరో!
సినిమాలతో పాటు రామ్ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది. తనతో పాటు చదివిన స్కూల్‌మేట్‌తో రామ్ ప్రేమలో ఉన్నారని వార్తలు రాగా... తాను అసలు హై స్కూల్‌కు వెళ్ళలేదని రామ్ ఖండించిన సంగతి తెలిసిందే.
Also Read : ఆ అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్ - ఉదయ్‌పుర్ ఘటనపై ప్రణీత స్పందన
Oh God! Stop! …it’s reached a point wherein I’m having to convince my own family & friends that I’m not getting married to any “secret high school sweetheart”!
— RAm POthineni (@ramsayz) June 29, 2022
TBH,I hardly went to high school..🤷♂️🙏
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)