Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు పది కోట్లు ఎక్కువ ఇవ్వడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు
Pawan Kalyan Remuneration: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ రోజు రోజుకూ పెరుగుతోందని టాలీవుడ్ ఖబర్. ఆయనకు ముందుగా అనుకున్న రెమ్యూనరేషన్ కంటే 10కోట్లు ఎక్కువ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వచ్చారట.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న అగ్ర కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన షూటింగ్ డేస్ ఎన్ని రోజులు? సినిమాలో ఆయన నిడివి ఎంత? అనేది పక్కన పెడితే... భారీ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్.
త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న 'వినోదయ సీతమ్' రీమేక్‌కు కూడా పవన్ కళ్యాణ్ భారీ పారితోషికం అందుకున్నారని సమాచారం. ఆ సినిమా నిర్మాతలు పవర్ స్టార్‌కు రూ. 50 కోట్లు ఇవ్వడానికి రెడీ అయినట్టు గతంలో వినిపించింది. లేటెస్ట్ టాక్ ఏంటంటే... మరో పది కోట్లు ఎక్కువ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారట.
ప్రముఖ నటుడు, గతంలో తెలుగులో రవితేజ 'శంభో శివ శంభో' తీసిన తమిళ ఫిల్మ్ మేకర్ సముద్రఖని 'వినోదయ సీతమ్'కు దర్శకుడు. తెలుగులోనూ ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజులు షూటింగ్ చేస్తే సరిపోతుందట. నెలకు వారం చొప్పున రాబోయే మూడు నెలలు షూటింగ్ చేస్తానని చెప్పారట. అంటే... పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ రోజుకు మూడు కోట్లు అన్నమాట.
'వినోదయ సీతమ్' రీమేక్‌లో పవన్‌తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరిగాయని తెలిసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ నెల రెండో వారంలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : పూరి జగన్నాథ్‌తో హ్యాట్రిక్‌కి విజయ్ దేవరకొండ రెడీ?
కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. యువకుడి పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నారు. ఆయన ఈ తరహా పాత్ర చేయడం రెండోసారి. గతంలో 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. అదీ సంగతి!
Also Read : తమిళ దర్శకుడితో ఉస్తాద్ రామ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్
View this post on Instagram