Gautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP Desam
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ప్రదర్శన జట్టులో పెద్ద మార్పులే తెచ్చేలా ఉంది. కోచ్ గంభీర్ స్టార్ ప్లేయర్లపై గుర్రుగా ఉంటే...కోచ్ గంభీర్ పై అసంతృప్తితో ఉంది బీసీసీఐ. వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించలేకపోయింది టీమిండియా. మొదటి టెస్టు గెలిచిన ఆనందం మర్చిపోయేలా వరుస మ్యాచుల్లో ఫలితాలు భారత్ నిరాశపరిచాయి. రెండో టెస్టు డ్రా అయితే...మూడు,నాలుగు టెస్టులు ఓడిపోయింది టీమిండియా. ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీల వైఫల్యం భారత్ ను తీవ్రంగా వేధిస్తోంది. అందుకే కోచ్ గంభీర్ వారి ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడట. స్టార్ ప్లేయర్లకు తను బాధ్యతలు తీసుకున్నప్పుడు అండగా నిలిచిన గంభీర్..6 నెలల పాటు తమకు నచ్చినట్లుగా ఆడుకోవచ్చని..ఆ తర్వాత ప్రదర్శనను రివ్యూ చేస్తానని చెప్పాడట. ఇప్పుడు ఆ ఆరునెలలు కంప్లీట్ అవటంతో పాటు కీలక సందర్భాల్లోనూ కొహ్లీ, రోహిత్ విఫలం అవుతుండటంతో గంభీర్ వారి ప్రదర్శనపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. పైగా టెస్టుల కోసం తనకు పుజారా కావాలని సెలక్షన్ కమిటీకి రిక్వెస్ట్ చేశాడట గంభీర్. అయితే ఇదై టైమ్ లో కోచ్ గంభీర్ ఫర్ ఫార్మెన్స్పై బీసీసీఐ పెద్దలు కూడా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. తనకు కావాల్సినట్లుగా మోర్నీ మోర్కేల్, ర్యాన్ డష్కటేను పోట్లాడి మరీ కోచింగ్ టీమ్ లో కి తీసుకున్న గంభీర్...టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్ ను ఏ ప్రతిష్ఠాత్మక సిరీస్ లోనూ గెలిపించలేకపోయాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ ఓడిపోవటం...సొంతగడ్డపై న్యూజిలాండ్ కు టెస్ట్ సిరీస్ ను కోల్పోవటం..ఇప్పుడు బీజీటీలో భారత్ దారుణ ప్రదర్శనతో బీసీసీఐ ఆలోచనల్లో పడిందట. ఆటగాళ్ల ఎంపికల్లో గంభీర్ విపరీత జోక్యం...అశ్విన్ లాంటి ఆటగాళ్లు సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించటం లాంటి అంశాలను పరిగణనలోకి బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.