Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP Desam
హిట్ మ్యాన్, టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడా. ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే అవును అనే వినిపిస్తోంది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ పేలవ ప్రదర్శన చేస్తోంది. రోహిత్ శర్మ ఆడని మొదటి టెస్టు అయిన పెర్త్ టెస్టును భారత్ జస్ ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో అద్భుతంగా గెలుచుకుంది. ఆ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియాకు వచ్చి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ...వరుసగా మూడు టెస్టుల్లో భారత్ కు విజయాన్ని అందించలేకపోయాడు. అడిలైడ్ టెస్టు డ్రా కాగా...గబ్బా, మెల్ బోర్న్ టెస్టులను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. దీంతో దాదాపు 15ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా బీజీటీనీ భారత్ కు కోల్పోలేని స్థితికి చేరుకుంది. మరి ఇలాంటి సిచ్యుయేషన్ లో ఆఖరి సిడ్నీ టెస్ట్ లో కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికైతే సిడ్నీ టెస్టును నడిపించేది హిట్ మ్యానే అని భావిస్తున్నారు. కానీ ఆ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులోనూ భారత్ ను గెలిపించలేకపోతే టెస్టు సిరీస్ ను కోల్పోవటంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పైనా భారత్ ఆశలు కోల్పోవాల్సి వస్తుంది. సో సిడ్నీ టెస్టు తర్వాత కీలక నిర్ణయమైతే రోహిత్ శర్మ తీసుకుంటారని భావిస్తున్నారు. ఒకవేళ రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్పేస్తే..ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం బుమ్రానే జట్టును ముందుండి నడిపిస్తాడు.