Yashasvi Jaiswal Century: వన్డేల్లో యశస్వి జైస్వాల్ తొలి సెంచరీ.. అరుదైన జాబితాలో చేరిన భారత్ ఓపెనర్
Yashasvi Jaiswalతప్పక గెలవాల్సిన వన్డే మ్యాచ్‌ల్ టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. విశాఖ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో జైస్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Ind vs SA 3rd ODI Yashasvi Jaiswal Score | విశాఖపట్నం: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో యువ బ్యాటర్ జైస్వాల్ సెంచరీతో మెరిశాడు. 111 బంతుల్లో జైస్వాల్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. ఇందులో 10 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఇన్నింగ్స్ 36 ఓవర్లో బౌలింగ్ లో రెండో బంతికి సింగిల్ తీయడం ద్వారా జైస్వాల్ శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ (73 బంతుల్లో 75, 7 ఫోర్లు 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అంతకుముందు మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్ కు సెంచరీ (155) భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో వికెట్ కు సైతం రన్ మేషిన్ విరాట్ కోహ్లీతో కలిసి 60 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లీ సైతం సాధ్యమైనంత వేగంగా పరుగులు చేస్తుండటంతో భారత్ విజయం వైపు దూసుకెళ్తోంది.
Maiden ODI HUNDRED for Yashasvi Jaiswal! 💯
— BCCI (@BCCI) December 6, 2025
He becomes the 6⃣th #TeamIndia batter in men's cricket to score centuries in all three formats 🙌
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/dBzWmU6Eqh
టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మాట్‌లలో సెంచరీ సాధించిన 6వ భారతీయ ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. ఈ సిరీస్‌లో రెండు వన్డేల్లో వైఫల్యాల తర్వాత, జైస్వాల్ తన కెరీర్‌లో తొలి ODI సెంచరీని నమోదు చేసుకున్నాడు.
3 ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన భారత బ్యాటర్లు
- సురేష్ రైనా
- రోహిత్ శర్మ
- కేఎల్ రాహుల్
- విరాట్ కోహ్లీ
- శుభ్‌మన్ గిల్
- యశస్వి జైస్వాల్
రోహిత్ రికార్డుల జోరు
వన్డే కెరీర్‌లో రోహిత్ శర్మకు ఇది 60వ అర్ధ శతకం. ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌తో కలిసి కేవలం 20 ఓవర్లలోనే శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. వన్డేలలో దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇది 10వ 100కు పైగా తొలి వికెట్ భాగస్వామ్యం. కార్డిఫ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2013 ఓపెనర్‌లో రోహిత్, ధావన్ మధ్య నమోదైన 127 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఇదే తొలి శతక భాగస్వామ్యం. అంటే, దాదాపు 12 ఏళ్ల తరువాత సఫారీలతో ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ అరుదైన భాగస్వామ్యంలోనూ రోహిత్ శర్మ మరోసారి భాగమయ్యాడు.
Look at what it means to him! 🥳
— BCCI (@BCCI) December 6, 2025
What a special knock this has been from Yashasvi Jaiswal 🙌
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/BHyNjwOGWY
ODIలలో మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంలో రోహిత్ శర్మ పాలుపంచుకోవడం ఇది 35వ సారి. భారత్ నుంచి సచిన్ టెండూల్కర్ (40) మాత్రమే రోహిత్ కంటే ముందున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగుల మైలురాయి చేరుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. సచిన్, కోహ్లీ, ద్రావిడ్ తరువాత రోహిత్ శర్మ ఉన్నాడు.
Also Read : Rohit Sharma Records: అరుదైన జాబితాలో చేరిన రోహిత్ శర్మ.. ద్రావిడ్ తరువాత హిట్ మ్యాన్





















