అన్వేషించండి

Rohit Sharma Records: అరుదైన జాబితాలో చేరిన రోహిత్ శర్మ.. ద్రావిడ్ తరువాత హిట్ మ్యాన్

Ind vs SA 3rd ODI | భారత ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 20000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్ హిట్ మ్యాన్.

Rohit Sharma Records | విశాఖపట్నం: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో 27 పరుగుల వద్ద అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ 20 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్ రోహిత్. ఈ జాబితాలో అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు.

13.4వ ఓవర్లో కేశవ్ మహారాజ్ వేసిన బంతిని రోహిత్‌ లాంగ్ ఆఫ్ వైపు ఆడి సింగిల్ తీశాడు. తద్వారా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేశాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సింగిల్స్ తీస్తూ, వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ హిట్ మ్యాన్ రోహిత్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలో 54 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.

2023 నుండి ODIలలో భారత్ తరఫున వికెట్ కోల్పోకుండా పవర్‌ప్లేలో చేసిన అతి తక్కువ స్కోరు ఇదే 48/0. 

అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పైగా పరుగులు చేసిన భారత ఆటగాళ్లు
-  34357 - సచిన్ టెండూల్కర్
-  27910 - విరాట్ కోహ్లీ (ఇంకా ఆడుతున్నాడు)
-  24208 - రాహుల్ ద్రవిడ్ 
-  20000 - రోహిత్ శర్మ (ఇంకా ఆడుతున్నాడు)
-  18,433 - సౌరవ్ గంగూలీ

రోహిత్ రికార్డుల జోరు
వన్డే కెరీర్లో రోహిత్ శర్మకు ఇది 60వ హాఫ్ సెంచరీ. వన్డేలలో దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇది 10వ 100కు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం. జైస్వాల్ తో కలిసి రోహిత్ 20 ఓవర్లలో శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. కార్డిఫ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2013 ఓపెనర్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మధ్య నమోదైన 127 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఇదే తొలిసారి. అంటే 12 ఏళ్ల తరువాత సఫారీలతో ఓపెనర్ల సెంచరీ భాగస్వా్మ్యం ఇది. ఇందులోనూ రోహిత్ శర్మ భాగస్వామి కావడం విశేషం. రోహిత్ ODIలలో మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంలో 35వ సారి పాలుపంచుకున్నాడు. భారత్ నుంచి సచిన్ టెండూల్కర్ (40) తరువాత రోహిత్ ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగుల మైలురాయి చేరుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Advertisement

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget