By: ABP Desam | Updated at : 16 Sep 2022 07:07 PM (IST)
'ఖుషి' సినిమా వాయిదా పడక తప్పదా?
విజయ్ దేవరకొండ, సమంత జంటగా 'ఖుషి' అనే సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ లో వస్తోన్న 11వ సినిమా ఇది. మొన్నామధ్య సినిమా ఫస్ట్ లుక్ ని వదిలారు. కశ్మీర్ నేపథ్యంలో అందమైన ప్రేమకథతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విజయ్ 'లైగర్' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండడంతో కొన్నాళ్లపాటు 'ఖుషి' సినిమా షూటింగ్ ను హోల్డ్ లో పెట్టారు.
రీసెంట్ గానే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. 'లైగర్' సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు విజయ్ దేవరకొండ. కొన్నిరోజుల క్రితం ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సమంత కొన్ని కారణాల వలన కొత్త షెడ్యూల్ లో పాల్గొనలేనని చెప్పిందట. దీంతో సినిమా అనుకున్న సమయానికి పూర్తికాకపోవచ్చు. కాబట్టి చెప్పిన సమయానికి సినిమా రాకపోవచ్చని టాక్. మరోపక్క డిసెంబర్ లో భారీ సినిమాలు పోటీ పడుతున్నాయి. 'ఖుషి' బుక్ చేసుకున్న స్లాట్ కే అఖిల్ 'ఏజెంట్' వచ్చే ఛాన్స్ ఉంది.
అలానే 'అవతార్2', రణవీర్ సింగ్ నటిస్తోన్న 'సర్కస్' సినిమాలు డిసెంబర్ చివరి వారంలోనే రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ సినిమాలకు తెలుగులో కూడా క్రేజ్ ఉంది. ఆ రకంగా చూసుకున్నా.. 'ఖుషి'కి పోటీ తప్పదు. సో.. నిర్మాతలు వచ్చే ఏడాదికి సినిమాను వాయిదా వేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
'ఖుషి' కోసం టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్:
'హృదయం' సినిమా గుర్తుందా? మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ హీరోగా... దర్శనా రాజేంద్రన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. హైదరాబాద్‌లో కొన్ని థియేటర్లలో విడుదలైంది. అప్పుడు కొందరు చూశారు. ఓటీటీలో విడుదలయ్యాక ఇంకొందరు చూశారు. పాటలను అయితే చాలా మంది విన్నారు. ఆ సినిమాకు ఎంత పేరు వచ్చిందో.. పాటలకు అంతే పేరు వచ్చింది. దాంతో ఆ సినిమా సంగీత దర్శకుడి చేత తమ సినిమాకు సంగీతం చేయించుకోవాలని దర్శక - నిర్మాతలు ట్రై చేస్తున్నారు. అతడి పేరు హెషమ్ వహాబ్. ఇప్పుడు అతడు తెలుగులో 'ఖుషి' సినిమాకి పని చేస్తుండడం విశేషం.
మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్
The Boys Season 4: ‘ది బాయ్స్’ వెబ్ సీరిస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సీజన్ 4 వచ్చేస్తోంది, ఇదిగో తెలుగు టీజర్
Animal: 'యానిమల్'లో హీరోయిన్గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
/body>