అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Samantha: సమంతను భరించడం కష్టంగా మారిందా..?
సమంత ఇప్పుడు తన రూటు మార్చుకుంది. మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటోంది. దాంతో కొత్త కథలు వింటోంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటిన సమంత పెళ్లి తరువాత కమర్షియల్ సినిమాలకు దూరమైంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ.. తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. రీసెంట్ గా తన భర్తతో విడిపోయిన సమంత కెరీర్ పరంగా జోరు పెంచింది. వరుస సినిమాలను ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే శ్రీదేవి మూవీస్ బ్యానర్ ఓ సినిమా, అలానే ఓ బైలింగ్యువల్ సినిమా ఒప్పుకుంది ఈ బ్యూటీ. త్వరలోనే ఓ హిందీ సినిమా అనౌన్స్మెంట్ కూడా వస్తుందని అంటున్నారు.
Also Read: మంగళం శ్రీనుగా సునీల్.. రేపే ఇంట్రడక్షన్..
సమంత విషయంలో నిర్మాతలకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. రెమ్యునరేషన్ పరంగా ఆమె ఎలాంటి పేచీ పెట్టదనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో సమంత పూర్తిగా మారిపోయిందట. ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలనే దానిపై సమంత కాస్త పట్టుదలగానే ఉన్నట్లు సమాచారం. ఒక్కో సినిమాకి రూ.3 కోట్లు డిమాండ్ చేస్తుందట. నిజానికి సమంత పారితోషికం మొన్నటివరకు రూ.2 కోట్ల లోపే. పైగా తెలుగులో ఈ మధ్య సినిమాలు కూడా తగ్గించింది. కొత్త హీరోయిన్ల హవా పెరగడం, కమర్షియల్ సినిమాలకు సమంత దూరం కావడంతో.. నిర్మాతలు సమంతను లైట్ తీసుకున్నారు.
కానీ సమంత ఇప్పుడు తన రూటు మార్చుకుంది. మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటోంది. దాంతో కొత్త కథలు వింటోంది. సమంత ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు చేయనప్పటికీ.. ఆమె మార్కెట్ మాత్రం అసలు తగ్గలేదు. కాకపోతే.. మూడు కోట్ల రెమ్యునరేషన్ అనేసరికి నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారు. పూజాహెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్లు రూ.2 కోట్ల మార్కెట్ ను ఎప్పుడో దాటేశారు. తనకు కూడా అదే పారితోషికం ఇస్తానంటే కుదరదని పట్టుబడుతోంది సమంత. తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి డబ్బు వెనకేసుకోవాలని చూస్తుంది. కానీ సమంతను భరించాలంటే మాత్రం నిర్మాతలకు కష్టమే.
Also Read: బాలయ్య షోతో 'ఆహా'కి ఎన్ని బెనిఫిట్సో..
Also Read: మెగా 154 లాంఛింగ్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..
Also Read: శ్యామ్ సింగ రాయ్... తిరగబడిన సంగ్రామం వాడే! వెనకబడని చైతన్యం వాడే!
Also Read: భూమ్మీద జాగా లేనట్టు అక్కడికి పోయిండ్రు! ఆ తర్వాత ఏమైంది?
Also Read: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
విశాఖపట్నం
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement