అన్వేషించండి
Advertisement
Balakrishna's Unstoppable : బాలయ్య షోతో 'ఆహా'కి ఎన్ని బెనిఫిట్సో..
తొలిసారి బాలయ్య హోస్ట్ గా షో అనేసరికి జనాల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. పైగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమనేసరికి.. ఆయన ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకుల్లో కలిగింది.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో మొదటి ఓటీటీ సంస్థను మొదలుపెట్టారు. అదే 'ఆహా'. మొదట్లో కొన్ని ఒరిజినల్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలతో ఈ యాప్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. దీంతో సమంత, రానా, మంచు లక్ష్మీ ఇలా పేరున్న సెలబ్రిటీలను తీసుకొచ్చి కొన్ని షోలను ప్లాన్ చేశారు. ఇవి కొంతవరకు కలిసొచ్చినా.. సబ్ స్క్రిప్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో అల్లు అరవింద్ తన మాస్టర్ బ్రెయిన్ తో బాలయ్యను రంగంలోకి దింపారు. 'Unstoppable' అనే షోని మొదలుపెట్టారు.
Also Read: మెగా 154 లాంఛింగ్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..
తొలిసారి బాలయ్య హోస్ట్ గా షో అనేసరికి జనాల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. పైగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమనేసరికి.. ఆయన ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకుల్లో కలిగింది. దానికి తగ్గట్లే తొలి గెస్ట్ గా మోహన్ బాబుని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైనప్పుడు అందులో రాజకీయ అంశాలతో పాటు.. మెగాస్టార్ చిరంజీవి, చంద్రబాబు నాయుడులకు సంబంధించిన విషయాలు ఉండడంతో తొలి ఎపిసోడ్ తప్పకుండా చూడాలని ఫిక్సయిపోయారు అభిమానులు.
దీంతో ప్రోమో బయటకొచ్చిన సమయంలోనే 'ఆహా' సబ్ స్క్రిప్షన్స్ ఓ రేంజ్ లో పెరిగాయట. యూత్ తో పాటు మిడిల్ ఏజ్, పెద్దవాళ్లు కూడా 'ఆహా' సబ్ స్క్రిప్షన్స్ కోసం ఎగబడినట్లు సమాచారం. బాలయ్యకి అన్ని వర్గాల అభిమానులు ఉండడంతో అల్లు అరవింద్ ప్లాన్ వర్కవుట్ అయింది. కేవలం బాలయ్య ఏం మాట్లాడతారో వినాలని సబ్ స్క్రిప్షన్స్ తీసుకున్న వాళ్ల చాలా మంది ఉన్నారు.
ఆ ఆసక్తిని మరింత పెంచుతూ.. షోలోకి అగ్ర తారలను తీసుకొస్తున్నారు. పది ఎపిసోడ్స్ గా ఈ షోను ప్రసారం చేయనున్నారు. చిరంజీవి-రామ్ చరణ్, ఎన్టీఆర్-ప్రభాస్ లాంటి స్టార్లను తీసుకురానున్నారు. అందుతున్న సమాచారం చిరంజీవిని లాస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఫినిషింగ్ ఎపిసోడ్ ను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. దెబ్బకి 'ఆహా' సబ్ స్క్రిప్షన్స్ పెరిగిపోవడం ఖాయమనుకుంటున్నారు. రీసెంట్ గానే 'ఆహా 2.0'ని లాంచ్ చేశారు. కొత్త సాఫ్ట్ వేర్ తో 'ఆహా' యాప్ ని డెవలప్ చేశారు.
Also Read: శ్యామ్ సింగ రాయ్... తిరగబడిన సంగ్రామం వాడే! వెనకబడని చైతన్యం వాడే!
Also Read: భూమ్మీద జాగా లేనట్టు అక్కడికి పోయిండ్రు! ఆ తర్వాత ఏమైంది?
Also Read: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..
Also Read: దంచికొడితే రోలు పగిలిందంతే... జయమ్మగా సుమ కనకాలను చూశారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆట
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion